షర్మిల తో ఆస్తుల వివాదంపై జగన్ ఓపెన్ కామెంట్స్..!!

మాజీ సీఎం జగన్ తన చెల్లి షర్మిలతో వివాదం పై తొలి సారి స్పందించారు. ఆస్తుల వ్యవహారం లో జగన్ - షర్మిల మధ్య ఉన్న వివాదాల పైన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు రాజకీయంగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ - షర్మిల ఒకరికి మరొకరు రాసిన లేఖ లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ మీడియాలో వస్తున్న కథనాల పైన స్పందించారు. మీడియాకు సూచనలు చేసారు.

బాధితులకు ఆర్దిక సాయం
విజయనగరం జిల్లా గుర్లలో అతిసార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉన్న చోట ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. శానిటేషన్ గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. పాఠశాలల బెంచుల పైన ఉంచి చికిత్స ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తాను ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం ఈ గ్రామంలో బాధితుల పరిస్థితి పట్టించుకోలేదన్నారు. డయేరియా బారిన పడిన వారికి కార్పోరేట్ ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదని జగన్ నిలదీసారు.

YS Jagan Announces financial assistance for Gula Diarrhea affected families

ప్రభుత్వ వైఫల్యమే
గుర్ల గ్రామంలో డయేరియాతో 14 మంది మరణించటం ప్రభుత్వ వైఫల్యమేనని జగన్ ఆరోపించారు. తమ హయాంలో గ్రామంలోనే అన్ని వసతులు అందుబాటులో ఉండేవని గుర్తు చేసారు. విలేజ్ క్లినిక్ లను పీహెచ్ సీలతో అనుసంధానం చేసామని.. ఏఎన్ఎం లు గ్రామాల్లోనే ఉండేవారని వివరించారు. సెప్టెంబర్ 20న తొలి డయేరియా కేసు నమోదు అవుతే 35 రోజులు అయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. గుర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో 340 మంది చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. చంపా నదిలో దారుణమైన స్థితిలో నీళ్లు ఉన్నాయన్నారు. వాటర్ స్కీమ్ మెయిన్ టెయినెన్స్ కూడా రెన్యువల్ చేయలేదని విమర్శించారు.

తల్లి, చెల్లి ఫొటోలతో రాజకీయం
వైద్యం అవసరమైన వారికి విశాఖ, విజయనగరం ఎందుకు తరలించలేదని జగన్ ప్రశ్నించారు. క్లోరినేషన్ కూడా చేయలేదన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. డయేరియాతో మరణించిన వారి కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించారు. ఇక, తన చెల్లితో వివాదం పైన జగన్ స్పందించారు. టీడీపీతో పాటుగా వారి మద్దతు మీడియా తన చెల్లి, తల్లి ఫొటోలతో రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మీ ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు లేవా అని జగన్ ప్రశ్నించారు. అందరి ఇంట్లో ఉన్నదే తమ ఇంట్లో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం వదిలేసి ప్రజా సమస్యల పైన పని చేయాలని జగన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+