జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మరో సారి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా హెచ్చరికలు చేసిన జగన్.. 2029 లో వైసీపీ అధికారంలోకి రావటం ఖాయ మని ధీమా వ్యక్తం చేసారు. జువ్వలదిన్నె హార్బర్ ను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే.. అధికారం లోకి వస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ హెచ్చరించారు. గతంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తే.. ఇదే తరహాలో జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కొద్ది రోజులుగా మత్స్యకారుల వివాదం కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ జువ్వలదిన్నెలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యల పైన స్పందించటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో నాలుగు పోర్టులు, 10 హార్బర్ లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు పనులు చేపట్టామని గుర్తు చేసారు . దాదాపు 26 వేల కోట్ల పెట్టుబడులతో వీటి పనులకు శ్రీకారం చుట్టామని.. తాము ప్రారంభించిన పోర్టులు హార్బర్లు పనులు జరగడం లేదని జగన్ అన్నారు. పనులు పూర్తి చేసి ఎన్నికల ముందు ప్రారంభించామని... ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్రమోదీ సైతం వర్చువల్ గా ఈ హార్బర్ ను ప్రారంభించారని జగన్ చెప్పుకొచ్చారు.

హార్బర్ ఎవరికైనా ఇస్తే ..స్వాధీనం చేసుకుంటాం
ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకారులకు ఏనాడూ మంచి చేసే ఆలోచన చేయలేదని జగన్ పేర్కొన్నారు. ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నర అయిందని... మత్స్యకారులకు ఎందుకు హ్యాండోవర్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఈ హార్బర్ ను నమ్ముకుని 25వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ హార్బర్ లో 1255 బోట్లు నిలిపేలా నిర్మాణం చేశామన్నారు. ఈ హర్బర్ ఢిపెన్స్ కంపనీలకు ఇవ్వాలని చూస్తున్నారని .. ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలంటే కృష్ణ పట్నం పోర్టు దగ్గర ఇచ్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా మా ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. హార్బర్లు మత్స్యకారుల సొత్తు. చంద్రబాబు కాదుకదా ఆయన తాత వచ్చిన ఎవరు ఆపలేరు. రాష్ట్రంలో హార్బర్లు అన్ని మత్స్యకారుల సంపదేనని జగన్ అన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదు.. ప్రజలు గట్టిగా బుధ్ది చెబుతారు అంటూ జగన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications