జగన్ సర్కారు సంచలనం: నిజం చెప్పిన తొలి రాష్ట్రం ఏపీ -మోదీ సాయం అందేనా? -భారత్‌ ఫార్మాకు ఉచ్చు

కరోనా వైరస్ సంబంధిత అంశాల్లో తొలి నుంచీ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా మరణాలు సంభవించలేదంటూ కేంద్రం అనూహ్య ప్రకటన చేయగా, మిగతా రాష్ట్రాలన్నీ ఆక్సిజన్ మరణాలపై మౌనంగా ఉండిపోగా, జగన్ సర్కారు మాత్రం పచ్చి నిజాలను కుండబద్దలు కొట్టేసినట్లుగా చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత వల్ల ప్రజలు చనిపోయిన విషయాన్ని ఏపీ స్పష్టంగా పేర్కొంది. దీంతో..

అంగీకరించిన తొలి రాష్ట్రం..

అంగీకరించిన తొలి రాష్ట్రం..

కరోనా రెండో దశ విలయంలో వైరస్ వల్ల సంభవించిన మరణాలతోపాటు ఆక్సిజన్ కొరత వల్ల కూడా వేలాది మంది చనిపోయినట్లు రిపోర్టులు ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వాలు అంగీకరించకపోవడం, దేశంలో ఆక్సిజన్ కొరత మరణాలే లేవని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం పెనుదుమారానికి దారి తీసింది. విపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితిల్లో కేంద్రం.. రాష్ట్రాల నుంచి నివేదికలు కోరింది.

పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా నివేదికలు పంపాల్సిఉండగా మెజార్టీ రాష్ట్రాలు అసలీ విషయంపై స్పందించనేలేదు. 13 రాష్ట్రాలు నివేదికలు పంపినప్పటికీ, మరణాలను ధృవీకరించింది మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశే. తద్వారా ఆక్సిజన్ కొతర మరణాలను అంగీకరించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని..

కేంద్ర ఆరోగ్య మంత్రి భారతి వివరణ..

కేంద్ర ఆరోగ్య మంత్రి భారతి వివరణ..

కొవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవిచలేదని కొద్ది వారాల కిందట ప్రకటించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్.. మళ్లీ అదే రాజ్యసభలో.. ఆంధ్రా అందించిన సంచలన నివేదిక కారణంగా ఆక్సిజన్ కొరత మరణాలను అంగీకరించక తప్పలేదు. కరోనా రెండో దశ ఉద్ధృతిలో ఆక్సిజన్‌ కొరతతో మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్రమంత్రి కీలక వివరాలను తెలియజేశారు.

''కేంద్రం వద్ద ఉన్న ప్రాథమిక నివేదిక ప్రకారం.. వైరస్‌ రెండో ఉద్ధృతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గల ఆసుపత్రిలో కొందరు కరోనా బాధితులు మరణించినట్లు తెలుస్తోంది. 10కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ను లెవలింగ్‌ చేయడం, ఆసుపత్రిలో బ్యాకప్‌ సిస్టమ్‌ను ఆన్‌ చేయడం మధ్య విరామం ఫలితంగా వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్న రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడినట్లు తెలిసింది'' అని ఆమె వెల్లడించారు. కాగా,

ఆ రోజు రుయాలో ఏం జరిగింది?

ఆ రోజు రుయాలో ఏం జరిగింది?

ఆక్సిజన్ కొరత మరణాలకు సంబంధించి ఏపీ సర్కారు కేంద్రానికి పంపిన నివేదికలో.. తిరుపతి రుయా ఆస్పత్రిలో మే 10న చోటుచేసుకున్న ఘటనను ప్రధానంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం నెలకొని 11 మంది కరోనా బాధితులు చనిపోయినట్లు నాడు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో 5 నిమిషాల పాటు ఆలస్యం కావడంతో ఈ సంఘటన జరిగిందని, అయితే వెంటనే తేరుకొని ఆక్సిజన్‌ పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మే 10న(సోమవారం) రాత్రి 8 నుంచి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్‌ ప్రెజర్‌ సమస్య ఏర్పడిందని, దీంతో వెంటిలేటర్‌లో ఉన్న బాధితులు చనిపోయారన్న కలెక్టర్.. రుయా ఆసుపత్రిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, ఆక్సిజన్ కొరత మరణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ మేరకు..

భారతి ఫార్మాకు భారీ ఉచ్చు..

భారతి ఫార్మాకు భారీ ఉచ్చు..

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిన్ కొరత మరణాలకు సంబంధించి ప్రభుత్వం అనూహ్య చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన తొలిరోజు మరణాల సంఖ్యను 11గా కలెక్టర్ పేర్కొన్నప్పటికీ, మొత్తం 23 మంది కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించింది. ఆక్సిజన్ కొరతకు కారకులైనవారికీ ఉచ్చ బిగించిన సర్కారు, నాలుగు రోజుల కిందట(ఆగస్టు 7న) హైకోర్టులో కీలక అఫిడవిట్ సైతం సమర్పించింది.

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అందకపోవడం కారణంగానే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్న ప్రభుత్వం తెలిపింది.

ఆక్సిజన్‌ అయిపోయిందని తెలిసినా కాంట్రాక్టర్‌ సరఫరా చేయలేదన్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్‌పై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేశామని అఫిడవిట్‌లో పేర్కొంది. భారత్‌ ఫార్మా మెడికల్‌ ఆక్సిజన్ సప్లై లిమిటెడ్‌ కంపెనీపై కేసులు నమోదు చేశామని తెలిపింది.

కరోనా లెక్కల్లో జగన్ పక్కా.. మరి మోదీ?

కరోనా లెక్కల్లో జగన్ పక్కా.. మరి మోదీ?

దేశంలో కరోనా విలయం మొదలైనప్పటి నుంచీ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే భిన్న వైఖరిని అవలంభిస్తున్నది. మహారాష్ట్రాలో మాదిరిగా ఐదారు పెద్ద సిటీలు లేకపోయినా ఏపీలో భారీగా కేసులు నమోదు కావడానికి కారణం ఇక్కడి ప్రభుత్వం టెస్టులను వివివిగా చేయడమే.

పొరుగున ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలు దొంగ టెస్టులు, దొంగ లెక్కలు చూపుతున్నాయని సాక్ష్యాత్తూ హైకోర్టే ఆగ్రహించడం, జగన్ కరోనా లెక్కలపై టీఆర్ఎస్ మంత్రులు సైతం పరోక్ష ఆరోపణలు చేయడం తెలిసిందే. తీరా చూస్తే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. ఎక్కువ కేసులు చూపించిన రాష్ట్రాలకే ఎక్కువ టీకాలను కేంద్రం పంపిణీ చేస్తుండటంతో తక్కువ లెక్కల రాష్ట్రాలు ఖంగుతిన్నాయి.

విమర్శలకు వెరువకుండా కరోనా లెక్కలను జగన్ పక్కాగా చూపించడం వల్లే ఇప్పుడు ఏపీకి అత్యధికంగా టీకాలు అందుతున్నాయన్నది కాదనలేని వాస్తవం. అలాగే, కరోనా మరణాలు లక్షల్లో ఉన్నప్పటికీ, నష్ట పరిహారం ఇచ్చే దిశగా కేంద్రం ఆలోచించాలని సుప్రీంకోర్టు సూచించిన దరిమిలా ఒక వేళ అనుకూల నిర్ణయం వస్తే ఏపీలోని బాధితులకు భారీ ఊరల లభిస్తుంది.

ఇప్పుడు ఆక్సిజన్ కొరత మరణాల విషయంలోనూ మిగతా రాష్ట్రాలు గమ్మున ఉండగా, జగన్ సర్కారు మాత్రమే వాస్తవాలను కేంద్రానికి నివేదించడంతో రాబోయే రోజుల్లో కేంద్రం ఏదైనా సహాయం ప్రకటిస్తే అర్హురాలు అవుతుంది. మరి ఏపీ నిజాయితీగా చెప్పిన లెక్కలకు మోదీ సర్కారు తగిన పరిహారం ప్రకటిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+