సీఎం చంద్రబాబుకు జగన్ స్పెషల్ రిక్వెస్ట్..!!

ఏపీ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ మధ్య రాజకీయంగా పై చేయి సాధించటం కోసం కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. లడ్డూ వ్యవహారంలో ఒకరి పైన మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం పై విచారణ కోసం ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. ఈ నెల 4న శాసన మండలిలో లడ్డూ వ్యవహారం పైన చర్చ జరగనుంది. కాగా.. ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుతకుంటున్నారు. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం తో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పలువురు దుయాబ్ సహా పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. వీరి విషయం పైన తాజాగా మాజీ సీఎం జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రు లను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీకి చెందిన వేలాది మంది గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్నారని, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు, భద్రత కొరవడిందన్నారు. మరోవైపు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలా మంది ఎక్కడకిక్కడ చిక్కుకుపోయి, అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

ys-jagan-appeals-ap-govt-to-take-necessary-steps-in-to-assist-ap-people-stranded-in-gulf-amid-iran

రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచన

దీంతో, రాష్ట్రానికి చెందిన వారందరినీ సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుని, ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వారందరి నీ తరలించాలని కోరారు. ఇంకా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో కూడా సమన్వయం చేసుకుని, ప్రవాస ఆంధ్రుల పరిరక్షణకు చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలని జగన్ సూచించారు. ప్రవాసాంధ్రుల భద్రత, వారి సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న జగన్, ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం సైతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ ఉద్రిక్తతల సమయంలో దేశంలో ముందస్తు చర్యల పైన హెచ్చరిక లు చేసింది. దేశంలో ఎక్కడా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ లేఖ రాసింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పూర్తి అప్రమత్తత తో వ్యవహరించాలని నిర్దేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+