కోర్టుకు జగన్: విజయలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్: ఆస్తుల కేసుకు సంబంధంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, విజయ సాయి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
అనంతరం విచారణను కోర్టు ఈ నెల 31వ తేదికి వాయిదా వేసింది. జగన్ ఆస్తుల కేసుతో పాటు ఎమ్మార్, ఓఎంసి కేసుల విచారణను కూడా కోర్టు అదే తేదీకి వాయిదా వేసింది.

ఎపిఐఐసి విజయలక్ష్మికి ఎన్‌బిడబ్ల్యూ
విచారణకు హాజరుకాని ఎపిఐఐసి మాజీ జోనల్ మేనేజర్ విజయలక్ష్మి ప్రసాద్ పైన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
రేపు జగన్ షరతు సడలింపు పిటిషన్ పైన విచారణ
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉందని, అందుకే తనకు బెయిల్ షరతులని సడలించాలని కోరుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో వారం రోజుల క్రితం దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ రేపు (18వ తేది) విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications