ysrcp affiliated wing presidents : వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల ప్రకటన..
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం జరిగింది. పలు విభాగాలకు అధ్యక్షులు లేకపోవడం, ఇతరత్రా కారణాలతో పెండింగ్ లో ఉన్న ఈ నియామకాల్ని ఎట్టకేలకు సీఎం జగన్ చేపట్టారు. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తాజా నియామకాల ప్రకారం.. యువజన విభాగం అధ్యక్షుడిగా శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని, మహిళా విభాగానికి ఎమ్మెల్సీ పోతుల సునీతను నియమించారు. బీసీ సెల్ కు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని, ఎస్టీ సెల్ కు మత్సరస వెంకటలక్ష్మి, మేరాజోత్ హనుమంత్ నాయక్ ను నియమించారు. రైతు విభాగానికి ఎంవీఎస్ నాగిరెడ్డిని, విద్యార్ది విభాగానికి పానుగంటి చైతన్యను, చేనేత విభాగానికి గంజి చిరంజీవిని నియమించారు. వైఎస్సార్సీయూసీకి పూనూరు గౌతం రెడ్డిని, వికలాంగుల విభాగానికి బందెల కిరణ్ రాజు, సాంస్కృతిక విభాగానికి వంగపండు ఉష, ప్రచార విభాగానికి ఆర్.ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డిని నియమించారు.

ఇక గ్రీవెన్స్ సెల్ కు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, న్యాయవిభాగానికి మనోహర్ రెడ్డి, ఐటీ విభాగానికి పోసింరెడ్డి సునీల్, ఎన్నారై విభాగానికి మేడపాటి వెంకట్, వైస్సార్టీఎఫ్ కు కల్పలతా రెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. ఎస్సీ సెల్ కు జూపూడి ప్రభాకర్, నందిగం సురేష్, కైలే అనిల్, మొండితోక అరుణ్ కుమార్ ను నియమించారు. మైనార్టీ సెల్ కు వి.ఖాదర్ బాషా, వైఎస్సార్ సేవాదళ్ కు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డాక్టర్ల విభాగానికి బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కు మేడిది జాన్సన్, వాణిజ్య విభాగానికి పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్ ను నియమించారు.













Click it and Unblock the Notifications