జగన్ తెలంగాణ కసరత్తు: పరిశీలకుల ఎంపిక

ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహబూబ్‌నగర్ - గుణ్ణం నాగిరెడ్డి, నల్లగొండ - బాలమణెమ్మ, రంగారెడ్డి - గాదె నిరంజన్ రెడ్డి, వరంగల్ - జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి, మెదక్ - శ్రవణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ - నాయుడు ప్రకాష్, కరీంనగర్ - కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్ - వినాయక్ రెడ్డి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటించిన పరిశీలకుల జాబితాలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని భావిస్తున్న తరుణంలో కొన్ని స్థానాల్లోనైనా పాగా వేయాలనే ఉద్దేశంతో జగన్ పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.
జగన్ సమైక్య నినాదాన్ని అందుకోవడంతో అంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసులో ఉన్న పార్టీ నాయకులు తప్పుకున్నారు. కొండా సురేఖ, కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications