వైసీపీలో మెరుపు నియామకాలు: మెరికలకు ఛాన్స్
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు సమాయాత్తమౌతోన్నారు.
తాజాగా యువజన విభాగాన్ని యాక్టివేట్ చేశారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ విభాగం సభ్యులతో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ కూటమి పాలన వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, వరుసగా చోటు చేసుకుంటోన్నట్లుగా భావిస్తోన్న దాడులపై క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ క్రమంలో యువజన విభాగాన్ని మరింత పటిష్టం చేశారు వైఎస్ జగన్. యువజన విభాగానికి కొత్తగా అయిదుమంది కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అయిదుమందికీ జిల్లాల బాధ్యతలనూ అప్పగించింది.
కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైన వారిలో అన్నంరెడ్డి అదీప్ రాజు, కారుమూరి సునీల్ కుమార్, పేర్ని కిట్టు, భూమన అభినయ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. వారికి ఆయా జిల్లాలను కేటాయించారు. ఆ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అధ్యక్షుడితో కలిసి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసన సభ్యుడు జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు.
- అదీప్ రాజు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు
- కారుమూరి సునీల్ కుమార్- కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు.
- పేర్ని కిట్టు- కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు
- భూమన అభినయ్ రెడ్డి- ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు.
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- వైయస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కేటాయించారు.












Click it and Unblock the Notifications