జగన్ బెయిల్ పిటిషన్ పై నేడే విచారణ, రాజకీయవర్గాల్లో ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనాయకుడు వైసీపి అధినేత జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఈ కేసు విచారణకు హాజరు అవుతారా లే
అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనాయకుడు వైసీపి అధినేత జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఈ కేసు విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.ఈ కేసు విషయమై జగన్ కౌంటర్ ను దాఖలు చేయనున్నారు.
ఆస్తుల కేసులో వైసీపి అధినేత జగన్ సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నాడు.అయితే ఆయన బెయిల్ పై ఉన్నాడు.ఈ కేసుల విషయమై జగన్ కు చెందిన మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూలో బెయిల్ షరతులను ఉల్లంఘించేలా ఉందని సిబిఐ ఆరోపిస్తోంది.
ఈ మేరకు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ మేరకు ఈ ఏడాది మార్చి 29వ, తేదిన పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను శుక్రవారం నాడు విచారించనుంది సిబిఐ కోర్టు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలను ఢిల్లీలో వివరించేందుకుగాను జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన టిడిపి ఫిరాయింపుదారులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించిన విషయాన్ని ఆయన ఢిల్లీ స్థాయి నాయకులకు వివరిస్తున్నారు.

సిబిఐ ఎందుకు బెయిల్ పిటిషన్ ను కోరిందంటే?
ఇటీవల కాలంలో జగన్ కు చెందిన మీడియా ఛానల్ లో మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు.ఈ ఇంటర్వ్యూలో కేసును ప్రభావితం చేసే రకంగా ఉందని సిబిఐ అభిప్రాయపడింది.ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఈ రకంగా వ్యవహరించడం నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ సిబిఐ కోర్టును ఆశ్రయించింది.జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును కోరింది.

కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు ఆదేశం
అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను కోర్టు ఆదేశించింది. శుక్రవారం నాడు దాఖలు చేయనున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్విడ్ క్రో పద్దతిలో వచ్చిన పెట్టుబడులకు సంబంధించి జగన్ పై సిబిఐ 11 కేసులను దాఖలు చేసింది.

16 మాసాల పాటు జైల్లో జగన్
సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో 16 మాసాల పాటు జగన్ జైల్లో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన అన్ని కేసుల్లో కూడ జగన్ ఏ1 నిందితుడుగా ఉన్నాడు.అయితే ఈ కేసుల్లో జగన్ బెయిల్ పై ఉన్నాడు. అయితే కేసును ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నాడని సిబిఐ ఆరోపణలు చేస్తోంది.

రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ
శుక్రవారం నాడు సిబిఐ కోర్టు ఏ రకంగా స్పందిస్తోందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ కేసు విషయంలో జగన్ దాఖలు చేసే కౌంటర్ పట్ల కోర్టు ఎలా స్పందిస్తోందనేది రాజకీయవర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అయితే కోర్టు ఏం చెబుతోందనే విషయాన్ని రాజకీయవర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications