వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లే టార్గెట్?: పాదయాత్రకు ముందు జగన్ స్ట్రాటజీ, ఖర్చు భరించేందుకు ఆ ఇద్దరు..

ఇంత ఖర్చును జగన్ ఒక్కరే భరిస్తారా?.. లేక జగన్‌తో కలిసి పార్టీలోని మరెవరైనా ఖర్చును భరించబోతున్నారా?.. అన్న దానిపై స్పష్టత లేదు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పాదయాత్రకు ముందు పక్కా ప్రణాళిక రచించే పనిలో జగన్ బిజీగా గడుపుతున్నారు. 2019ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కదులుతున్న ఆయన.. కుల సమీకరణాలపై కూడా బాగానే ఫోకస్ చేశారు.

ఆంధ్రజ్యోతి సర్వే: కుల సమీకరణాల్లో టీడీపీ-వైసీపీ సత్తా ఎంత?ఆంధ్రజ్యోతి సర్వే: కుల సమీకరణాల్లో టీడీపీ-వైసీపీ సత్తా ఎంత?

ఈ క్రమంలోనే ఆయన హిందు ఓటు బ్యాంకును టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మెజారిటీలైన బీసీలకు పార్టీని మరింత దగ్గర చేయాలని జగన్ భావిస్తున్నారు. బీసీల్లో ఉన్న మద్దతు మూలంగానే టీడీపీ అధికారంలోకి వస్తోందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో ఆ మద్దతును తమవైపు తిప్పుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు.

టార్గెట్-50: జగన్ మాస్టర్ ప్లాన్.. లిస్ట్, రూట్ మ్యాప్ సిద్దం, టీడీపీ కంచుకోటలకు ఎర్త్?టార్గెట్-50: జగన్ మాస్టర్ ప్లాన్.. లిస్ట్, రూట్ మ్యాప్ సిద్దం, టీడీపీ కంచుకోటలకు ఎర్త్?

మెజారిటీ 'బీసీ'లే టార్గెట్:

మెజారిటీ 'బీసీ'లే టార్గెట్:

బీసీలను ఆకట్టుకోవాలంటే వారి సంక్షేమ, అభివృద్ది కోసం వైసీపీ నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ జనం నాడి పట్టుకునేందుకు స్వయంగా వారితో భేటీ అవనున్నారు. బీసీల ఆకాంక్షలను తెలుసుకుని.. భవిష్యత్తులో వాటి అమలుకు చర్యలు తీసుకునేలా భరోసా ఇవ్వనున్నారు.

ఈ మేరకు జగన్ పలు బీసీ సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాలను సమీకరించాలనే లక్ష్యానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. బీసీలతో పాటు పాదయాత్రకు ముందు క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలతోను జగన్ భేటీ అయే అవకాశముంది.

 భారీ ఖర్చు:

భారీ ఖర్చు:

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ మొదలుపెట్టే పాదయాత్ర దాదాపు 120నియోజకవర్గాల మీదుగా సాగనుంది. పాదయాత్ర ఆసాంతం ఆయన వెంట భారీ స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి నడవనున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ బస ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చు తప్పదు. ఇంత ఖర్చును జగన్ ఒక్కరే భరిస్తారా?.. లేక జగన్‌తో కలిసి పార్టీలోని మరెవరైనా ఖర్చును భరించబోతున్నారా?.. అన్న దానిపై స్పష్టత లేదు.

 గతంలో వైఎస్, బాబుల పాదయాత్ర ఖర్చు:

గతంలో వైఎస్, బాబుల పాదయాత్ర ఖర్చు:

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు నిధుల సమస్య తలెత్తలేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడం.. హైకమాండ్ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండటంతో వ్యక్తిగతంగా ఆయనపై భారం పడలేదు.

చంద్రబాబు పాదయాత్ర సమయంలోను ఖర్చుల సమస్య పెద్దగా లేదనే చెప్పాలి. సంస్థాగతంగా టీడీపీ బలమైన పార్టీ కావడం.. పార్టీలో సంపన్నులకు కొదవలేకపోవడంతో ఆయనకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా రోజుకి దాదాపు రూ.20లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది.

ఖర్చు భరించేందుకు ఆ ఇద్దరు?:

ఖర్చు భరించేందుకు ఆ ఇద్దరు?:

వైసీపీకి సంబంధించి ఏ కార్యక్రమమైనా జగన్ ఇచ్చే నిధుల పైనే ఆధారపడి ఉంటుంది. అయితే పాదయాత్ర సమయంలో పదుల సంఖ్యలో నేతలు, వందల సంఖ్యలో కార్యకర్తల ఖర్చు భరించడం అంటే మామూలు విషయం కాదు.

అందుకే వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా పాద‌యాత్ర ఖ‌ర్చులు భరించేందుకు సిద్దమని ముందుకొచ్చారట. అయితే స్థానికంగా జనసమీకరణ ఖర్చులు మాత్రం అక్కడి నేతలకే వదిలేస్తున్నారట. ఖర్చులకు సంబంధించి ఇప్పుడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
With YS Jagan embarking upon an ambitious and long-winding Padayatra covering six months, 3000 km and 120 assembly constituencies, there were some concerns among the grassroots level leaders of the YSRCP. They were worried as such a huge programme would mean heavy expenditure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X