రాహుల్‌కు కాదు బాబుకు: జగన్ ట్విస్ట్, దుమ్మెత్తిపోసిన టిడిపి నేతలు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని చూసే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జ్ఞానోదయం కావాల్సింది రాహుల్ గాంధీకు కాదని, చంద్రబాబుకు అని జగన్ ట్విస్ట్ ఇచ్చారు.
రాహుల్ గాంధీపై దుమ్మెత్తిపోసిన టిడిపి నేతలు
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు కాంగ్రెస్ పార్టీయే కారణమని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని తమకు చాలామంది విజ్ఞప్తి చేశారని, కాని తెలుగు వారి సంస్కారం తమకు అడ్డు వచ్చి ఆ పని చేయలేదని చెప్పారు.
అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రాన్ని మీ స్వార్థం కోసం విభజించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదన్న విషయం తెలియదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయన్నారు. అప్పుడు ఎందుకు పరామర్శించలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా కట్టి తీరుతామన్నారు. ఏడాది కాలంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. తెలుగు ప్రజలను మోసం చేసేందుకే రాహుల్ గాంధీ పర్యటించారన్నారు. అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన గాయాలు మానకమందే రాహుల్ గాంధీ పర్యటన విడ్డూరమన్నారు.
విభజన చట్టంలో ప్రత్యేక హోదా విషయం లేదని కూడా తెలియని అజ్ఞాని రాహుల్ గాంధీ అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. ఆ ఆత్మహత్యలకు మీరు బాధ్యులు కాదా అని ప్రశ్నించారు. పోలవరం కట్టి తీరుతామన్నారు.
అన్యాయం మర్చిపోరు: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోలేరని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పోలవరం పైన మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు.












Click it and Unblock the Notifications