బాబు వల్లే: జగన్ ట్విస్ట్, కేసీఆర్‌కు అండ, ఆంధ్రజ్యోతిపై..

హైదరాబాద్: శ్రీశైలం జల వివాదం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్పందించారు. శ్రీశైలం జల వివాదం విషయంలో విలేకరులు జగన్ స్టాండ్‌ను అడిగారు. ఈ సందర్భంగా జగన్ స్పందించారు.

శ్రీశైలం జల వివాదం పైన తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని, అది చదివి తన స్టాండ్ ఏమిటో తెలుసుకోవాలన్నారు. అది మీరు చదివినట్లు లేరని, మళ్లీ అందరికీ ఇస్తామని జగన్ విలేకరులతో అన్నారు. చంద్రబాబు తెలిసినా తప్పు చేసే రకమని విమర్శించారు.

శ్రీశైలంలో రైట్ సైడ్ చంద్రబాబు, లెఫ్ట్ సైడ్ కేసీఆర్ ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేశారని, పదిహేను రోజుల్లో భారీగా నీటిమట్టం తగ్గించాలని ధ్వజమెత్తారు. ఇద్దరు ఎడాపెడా వాడేశారన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబు ఆపేసి.. కేసీఆర్‌ను తిడతారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదన్నారు. సముద్రంలోకి నీళ్లను ఎలా పంపిస్తున్నారో చూస్తున్నామన్నారు.

 YS Jagan blames Chandrababu on TS and AP power fight

తెలంగాణకు విద్యుత్ అవసరం ఉందని తమకు తెలుసునని, అయితే, కేసీఆర్ కూడా కొంత మానవత్వంతో ఆలోచించాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో కేసీఆర్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే, కేసీఆర్ ఖర్మ ఏమిటంటే.. విద్యుత్ సరఫరాకు మరో రెండుమూడేళ్లు పట్టవచ్చునన్నారు. రామగుండం థర్మల్ పవర్, ఎన్టీపీసీ విద్యుత్ విషయమై కేసీఆర్‌కు తాను సలహా ఇస్తున్నానని చెప్పారు.

తెలంగాణలోను...

తెలంగాణలోని సమస్యల పైన తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసే విషయాన్ని విలేకరులు అడిగారు. దీని పైన జగన్ స్పందించారు. ఈ సమయంలో ఆంధ్రజ్యోతి విలేకరు ఓ ప్రశ్న అడిగారు.

జగన్ స్పందిస్తూ.. ఆంధ్రజ్యోతి కదా.. అడుగు, నీకు చాలా బాధ ఉన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సంబంధించి తమ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశామని, ఆయన ఇప్పటికే తెలంగాణలోని సమస్యల పైన గవర్నర్‌ను కలిశారని చెప్పారు. ఎమ్మెల్యేల చేత రిప్రజెంటేషన్ ఇప్పించారన్నారు. ఆయన గట్టిగా కష్టపడుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+