మోడీ, అమిత్ షా దృష్టికి ఏపీ పరిస్థితులను తీసుకెళ్లిన జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యంపై, టీడీపీ దాడుల పర్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ఏపీలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు జగన్. అంతేగాక, ప్రధాని మోడీకి లేఖ రాశారు.
'రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది' అని జగన్ విమర్శించారు.

'నిన్నటి(బుధవారం) వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు.
Andhra Pradesh is under demonic rule. Law and order is nowhere to be seen. People's lives are at risk and these atrocities are being committed with the intention of suppressing the YSRCP. Within a month and a half of the new government taking office, Andhra Pradesh has become…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
'అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తిచేస్తున్నాను. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను.
వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని జగన్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. కాగా, శుక్రవారం రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications