జగన్ బంపర్ ప్లాన్- ఉద్యోగుల్లో అసంతృప్తికి చెక్-మాజీ నేతకు కొత్త పోస్టు, ఎమ్మెల్సీ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. వాటిని నిలబెట్టుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా నానాటికీ దారుణంగా తయారవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పించన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో వారిలో అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

 నెరవేరని జగన్ హామీలు

నెరవేరని జగన్ హామీలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఉద్యోగులతో సమావేశమైన సీఎం జగన్ వారికి ఐఆర్ ప్రకటించారు. ఆ తర్వాత సీపీఎస్ రద్దు, సకాలంలో డీఏల చెల్లింపు, పీఆర్సీ ఇస్తామన్న హామీల్ని కూడా జగన్ అమలు చేస్తారని ఉద్యోగులు భావించారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మాత్రం పూర్తి భిన్నంగా తయారైంది. సీపీఎస్ రద్దు విషయంలో కేంద్రం అభ్యంతరాలతో ముందుకు సాగని పరిస్ధితి. డీఏల బకాయిల చెల్లించాలన్నా, కొత్త పీఆర్సీ ప్రకటించాలన్నా ఖజానా సహకరించని పరిస్ధితి. దీంతో వీటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది.

 నెలవారీ జీతాలు, పింఛన్లకూ కటకట

నెలవారీ జీతాలు, పింఛన్లకూ కటకట

ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు, పీఆర్సీ హామీల నెరవేరకపోయినా కనీసం జీతాలైనా సకాలంలో వస్తున్నాయని వారు సంతృప్తి చెందే వారు. కానీ తాజాగా సంక్షేమ పథకాలు గుదిబండగా మారడంతో ఈ జీతాలతో పాటు రిటైరైన ఉద్యోగులకు పింఛన్లు కూడా సకాలంలో ఇవ్వడం కష్టంగా మారిపోతోంది. ఈ నెల అయితే మరీ దారుణంగా 15వ తేదీ వచ్చినా పూర్తిగా ఉద్యోగులు, పించనర్లకు చెల్లింపులు చేయలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలిపోతోంది. ప్రభుత్వం గత హామీలు నెరవేర్చినా, నెరవేర్చకున్నా కనీసం జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది.

 జగన్ బంపర్ ప్లాన్

జగన్ బంపర్ ప్లాన్

ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి తమకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించకున్నా... భవిష్యత్తులో మాత్రం సమస్యలు తప్పవని సీఎం జగన్ గుర్తించారు. అందుకే ఉద్యోగుల్లో అసంతృప్తి చల్లార్చేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్ధితి సహకరించని నేపథ్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని విపక్షాలు సొమ్ము చేసుకునే పరిస్దితి ఉండటం, వారిలో అపోహలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికీ, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం ఓ కొత్త పోస్టు సృష్టించాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలకు చెందిన ఓ సీనియర్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు.

 సమన్వయకర్తగా చంద్రశేఖర్ రెడ్డి

సమన్వయకర్తగా చంద్రశేఖర్ రెడ్డి

ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సమన్వయం కొరవడటం వల్ల వారిలో అపోహలు పెరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని సమన్వయ కర్తగా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సమన్వయ కర్తగా ఓ కొత్త పోస్టు సృష్టించి నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వెల్లడించారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి అనుభవాన్ని ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా వాడుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

 చంద్రశేఖర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

చంద్రశేఖర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

ప్రస్తుతం ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం మరో 20 నెలల్లో పూర్తి కాబోతోంది. ఆయన రిటైర్మెంట్ తో ఖాళీ అయ్యే స్ధానంలో చంద్రశేఖర్ రెడ్డిని కడప-కర్నూలు-అనంతపురం గ్రాడ్యుయేట్ స్ధానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు 20 నెలల సమయం ఉండటంతో అప్పటివరకూ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సమన్వయం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించబోతోంది. దీంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వరకూ ఆయన ఉద్యోగులకూ, ప్రభుత్వానికీ మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+