ఫస్ట్ డే జగన్ బిజీ: ఢిల్లీ రైలెక్కి నినదించారు (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించారు. ఈ భేటీలో ఆయన సమైక్యవాదంతోనే ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు సూచించారు.

అంతకుముందు ఎపిఎన్జీవోలు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని ఆయనను కోరారు. జగన్ విడుదలైన మొదటి రోజే బిజీబిజీగా గడిపారు. మంగళవారం సాయంత్రం జైలు నుండి విడుదలైన జగన్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి పది గంటలు అయింది. బుధవారం పార్టీ నేతలతో, ఇతరులతో, ఎపిఎన్జీవోలతో బిజీగా గడిపారు.

మరోవైపు సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాల్లో భాగంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. వారు ఈ నెల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సమైక్యాంధ్ర కోసం ఆందోళనల చేపట్టనున్నారు.

జగన్ భేటీ

జగన్ భేటీ

జైలు నుండి విడుదలైన మరుసటి రోజే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన దృశ్యం.

ఎపిఎన్జీవోలతో

ఎపిఎన్జీవోలతో

సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని, జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనకు మద్దతివ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్న ఎపిఎన్జీవోలు.

ఎపిఎన్జీవోలతో సమావేశం

ఎపిఎన్జీవోలతో సమావేశం

సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని, జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనకు మద్దతివ్వాలని తనను కోరిన ఎపిఎన్జీవోలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ.

ఢిల్లీకి

ఢిల్లీకి

సమైక్యాంధ్ర ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్ చేరుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

రైలు డబ్బాకు సేవ్ ఆంధ్ర ప్రదేశ్

రైలు డబ్బాకు సేవ్ ఆంధ్ర ప్రదేశ్

సమైక్యాంధ్ర ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్ చేరుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓ పోస్టర్‌‍ను రైలు డబ్బాకు అతిస్తున్న దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

సమైక్యాంధ్ర ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. రైలులో కూర్చొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

రైల్వే స్టేషన్లో జై సమైక్యాంధ్ర

రైల్వే స్టేషన్లో జై సమైక్యాంధ్ర

సమైక్యాంధ్ర ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్ చేరుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

రైలు డబ్బాలో సమైక్యాంధ్ర

రైలు డబ్బాలో సమైక్యాంధ్ర

సమైక్యాంధ్ర ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. రైలులో కూర్చొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+