వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ నోట్‌పై నిరసన, 72 గంటల బంద్‌కు జగన్ పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని ఆయన అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జైల్లో ఉన్నప్పుడు కూడా తాను ఇంతగా బాధపడలేదని ఆయన అన్నారు. సీట్ల కోసం, ఓట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టిందని ఆయన కాంగ్రెసు పార్టీని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు కాంగ్రెసుకు సహకరించారని ఆయన అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. మంత్రివర్గం ముందుకు తెలంగాణ నోట్ రాక ముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు తీర్మానం చేయాలని కోరుతూ తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశామని, గవర్నర్ నరసింహన్‌ను కలిసి తాము కోరామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

YS Jagan

రాష్ట్రాన్ని విడగొట్టిన తీరు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోందని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని కోరితే చంద్రబాబు పట్ిటంచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చారని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెసు రాష్ట్రాన్ని విభజిస్తే, ఓట్లూ సీట్లూ పోతాయనే ఆందోళనతో చంద్రబాబు కుమ్మక్కయి సహకరించారని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. 25 మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే యుపిఎ సంక్షోభంలో పడిపోతుందని, దాంతో తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని ఆయన అన్నారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని 2009 డిసెంబర్‌లో అప్పటి హోం మంత్రి చిదంబరం కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై కోర్టులకు కూడా వెళ్తామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan has called upon 72 hours bandh protestion against the approval of Telangana note by cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X