టిలోకి అలాగే వెళ్తానని జగన్, సోనియాపై: జైరాంకు షాక్

హైదరాబాద్/తిరుపతి: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. తెలంగాణలోను సమైక్యభావన నినాదంతోనే వెళ్తామన్నారు. రాష్ట్రాన్ని విభజించి ఇరు ప్రాంతాల్లో పెద్దమ్మ, చిన్నమ్మ అంటూ ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పలానా మంచి పని చేశాం.. ఓటేయండి అని అడిగే పరిస్థితి కాంగ్రెసు పార్టీకి లేదన్నారు.

భావోద్వేగాలతో ప్రజలను కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఓట్లు అడిగే హక్కు లేనందునే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఇప్పుడు ఎపిని విభజించాం ఓట్లేయండి అని అడిగినట్లుగా ఆ పార్టీల తీరు ఉందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, బిజెపి పార్టీల అజెండా ఒక్కటేనని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అన్నారు.

YS Jagan

రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్ర విభజన కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయాయని ఆరోపించారు. విభజనలో అక్కడా, ఇక్కడా కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం పార్టీల పాత్ర ఉందన్నారు. ఓ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే పెద్దమ్మ, చిన్నమ్మలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దిగజారిన రాజకీయాల మధ్య మనం ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. అడ్డగోలు విభజనలో తెరాస, టిడిపి, కాంగ్రెసు పార్టీల వైఖరి ఒక్కటే అన్నారు.

తెలుగువారు ఎక్కడున్నా వారి ఆప్యాయతలను విరగ్గొట్టలేరన్నారు. సమైక్యమంటే.. కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలో కూడా అన్నదమ్ములున్నారని అర్థమన్నారు. సమైక్యమంటే... రాయలసీమ నాది, కోస్తా నాది, తెలంగాణ నాది అన్న భావనే అన్నారు. ఇదే నినాదంతో తెలంగాణకు కూడా వెళ్తామన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ ఉంటుందని చెప్పారు.

పశ్చిమ గోదావరిలో జగన్ పర్యటన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 3, 4 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

జైరామ్ రమేష్‌కు జగన్ పార్టీ షాక్

కేంద్రమంత్రి, మంత్రుల బృందం సభ్యులు (జివోఎం) జైరామ్ రమేష్‌కు బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో చుక్కెదురయింది. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకొని, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన వెనుదిరిగి విమానాశ్రయంలోకి వెళ్లారు. జైరామ్ రమేష్‌కు క్లియర్ చేసేందుకు పోలీసులు జగన్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఎస్పీ సాయంతో జైరామ్ రమేష్ తిరుపతికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+