మనీలాండరింగ్‌లో జగన్‌కు మరో షాక్: రూ.232 కోట్ల ఆస్తులు అటాచ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఝలక్. మనీ లాండరింగ్ కేసులో మరిన్ని ఆస్తులను అటాచ్‌మెంట్ చేశారు. మొత్తం రూ.232కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
కాగా, ఆస్తుల కేసులో జగన్ ఇటీవల కూడా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో మూడు ఛార్జీషీట్ల పైన కోర్టుకు వచ్చారు. జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి తదితరులు వచ్చారు. కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. వీరి ఫిబ్రవరి నాలుగున కోర్టుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications