డబ్బెంత? విలువెంత? లేదంటే బెదిరింపులు: చంద్రబాబుపై జగన్, క్యూలో నిలబడి ఓటు

Subscribe to Oneindia Telugu

కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమంగా గెలువాలని చూస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగన్‌మోహన్‌ రెడ్డి జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లో(కడప, నెల్లూరు, కర్నూలు)నూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉందన్నారు. తమకు మెజార్టీ ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయడం సిగ్గుచేటు అని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు.

YS Jagan casts his vote in Jammalamadugu

టీడీపీకి బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి... అవహేళన చేయడం దారుణమని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

కడప జిల్లాలో 841మంది ఎమ్మెల్సీ ఓటర్లు ఉంటే.. వారిలో 521మంది ఓటర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచారన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి ఓటు వేయించుకోవాలని చూడటం సరికాదన్నారు. డబ్బెంత? విలువెంత అంటూ ఓటర్లను కొనేస్తున్నారని, లేదంటే బెదిరింపులకు, కిడ్నాపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ప్రజల్లో ఇంకా అభిమానం, మంచితనం మిగిలే ఉందని వైయస్‌ జగన్‌ అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా అంతమంగా న్యాయమే గెలుస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Friday Casts his Vote in MLC Elections in Jammalamadugu.
Please Wait while comments are loading...