పాదయాత్రలో ఓ స్వామీజీతో జగన్ మాటామంతీ.. సోషల్ మీడియాలో వైరల్!

2019లో అధికారమే లక్ష్యంగా 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణ నిమిత్తం శుక్రవారం ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది

కర్నూలు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఓ స్వామీజీ చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఆయనతో ముచ్చటించారు. ఆ స్వామీజీ కూడా 'జగన్ బాబూ.. నీకు మంచిరోజులు వస్తాయి..' అంటూ దీవించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2019లో అధికారమే లక్ష్యంగా 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణ నిమిత్తం శుక్రవారం ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. తిరిగి యథావిధిగా కర్నూలు జిల్లాలో యాత్ర శనివారం ప్రారంభమైంది.

YS Jagan Chitchat with a Swamiji, Post in Facebook goes Viral

ఈ పాదయాత్ర సందర్భంగా జగన్ ను ఓ స్వామీజీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ చేతిని ఆప్యాయంగా పట్టుకుని జగన్ ఆయనతో ముచ్చటించారు. ఈ ఫొటోను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

''ఏందయ్యా జగన్ బాబు, ఏంటి నీకు ఇన్ని కష్టాలు. ఎలా ఉండాల్సినవాడివి. ఎలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్టు ఉంది. దోచుకుని తింటున్నది ఒకరైతే... ప్రజల కాష్టాలు మాత్రం నీవా? జగన్ బాబు మంచి రోజులు వస్తాయి. సాక్షాత్తు ఓ స్వామీజీ జగన్ అన్నతో మాటలు ఇవి..'' అంటూ ఆ ఫొటోకు డిస్క్రిప్షన్ కూడా పెట్టారు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. 'నిజం గెలుస్తుందిలే స్వామీ... జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం..' అంటూ కొందరు స్పందించగా, 'నిజమే స్వామీ, ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జడ్జి దర్శనం చేసుకుని రావాలంటే కష్టంగానే ఉంది. ఏం చేస్తాం. బిడ్డ అల్లాడిపోతున్నాడు..' అంటూ మరి కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+