పెన్షన్ల తొలగింపుపై జగన్ క్లారిటీ- నోటీసులు అందుకే ! తేల్చేయాలంటూ కలెక్టర్లకు కీలక సూచన..!

ఏపీలో భారీ ఎత్తున పింఛన్లు తొలగిస్తున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పింఛన్ల లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా వెళ్తుండటంతో ఈ వ్యవహారంపై విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడింది. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఇవాళ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ఏ కారణంతో అయినా అందని వారికి అందించే కార్యక్రమం ప్రారంభించిన జగన్.. ఇవాళ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసుల వెనుక కారణాల్ని కూడా వెల్లడించారు.

ఏపీలో పింఛన్ల కోత

ఏపీలో పింఛన్ల కోత


ఏపీలో గత వారం రోజులుగా సామాజిక పింఛన్లు అందుకుంటున్న వేల మందికి నోటీసులు వెళ్లాయి. మీరు పింఛన్లకు అర్హులా కాదా అన్నది నిరూపించుకోవాలన్నది దాని సారాంశం. దీంతో ప్రభుత్వం వీళ్లందరికీ పింఛన్లు తొలగించబోతోందని, అందుకే నోటీసులు జారీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై విపక్షాలతో పాటు పలు మీడియా సంస్ధలు కూడా కథనాలు ప్రచురిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇంత భారీ ఎత్తున పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

పెన్షన్లపై జగన్ క్లారిటీ

పెన్షన్లపై జగన్ క్లారిటీ

రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు అనర్హులుగా మారిన వారికి మరో అవకాశం కల్పిస్తూ వారికి లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించిన సీఎం జగన్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పింఛన్ల తొలగింపు అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. అటు కలెక్టర్లకు కూడా కీలక సూచనలు చేశారు. ఇకపై దీనిపై ఎలాంటి గందరగోళం ఉండొద్దని కలెక్టర్లను జగన్ కోరారు.

 నోటీసులు అందుకే

నోటీసులు అందుకే

రాష్ట్రంలో సామాజిక పింఛన్లు అందుకుంటున్న వేలాది మందికి తాజాగా అధికారులు నోటీసులు జారీ చేస్తున్న వ్యవహారంపై జగన్ స్పందించారు. ఈ నోటీసులు ఎందుకు పంపుతున్నారన్న దానిపై జగన్ వివరణ ఇచ్చారు. ప్రతీ ఆరునెలలకోసారి అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆడిట్ చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగానే ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు జగన్ తెలిపారు. దీనికి భయపడాల్సిందేమీ లేదన్నారు. నోటీసులు జారీ చేసి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జగన్ వెల్లడించారు.

 పింఛన్ల తొలగింపు లేదన్న జగన్

పింఛన్ల తొలగింపు లేదన్న జగన్

రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారంపై జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఆయన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ పెన్షన్ తీసేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతోంది వెరిఫికేషన్ మాత్రమేనన్నారు. ఆరునెలల కోసం ఆడిట్ జరుగుతుందని, నోటీసులు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు తీసేయరన్నారు. దీంతో నోటీసులు ఇచ్చిన వారందరికీ పింఛన్లు తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ఇది కేవలం అనర్హుల్ని గుర్తించి తొలగించే ప్రక్రియ మాత్రమేనని జగన్ క్లారిటీ ఇచ్చారు.

 కలెక్టర్లకు జగన్ కీలక సూచన

కలెక్టర్లకు జగన్ కీలక సూచన

రాష్ట్రంలో పింఛన్ల తొలగింపు పేరుతో జరుగుతున్న ప్రచారంపై జగన్ మండిపడ్డారు. విషపు వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా సహా ఈ నేతల్ని దేవుడే శిక్షిస్తాడంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి తప్పుంటే సరిదిద్దుకుందామని, అలా కాకుండా విషప్రచారం చేసే ఉద్దేశంతో వచ్చే వార్తల్ని గట్టిగా తిప్పికొట్టాలని, వాటిపై ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+