అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు, రుషికొండ భవనాలు అందుకోసమే - జగన్ సంచలనం..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. కల్తీ మద్యం మొదలు.. విశాఖ గుగూల్ తో సహా.. రుషికొండ భవనాల నిర్మాణాల పై తొలి సారి స్పందించారు. ఆ నిర్మాణాల వెనుక లక్ష్యాల ను వెల్లడించారు. హైదరాబాద్ లో ఐటీ విస్తరణ...విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు. విశాఖ డేటా కేంద్రం వెనుక ఆదానీ, కేంద్రం కీలక పాత్ర పోషించాయని జగన్ వెల్లడించారు. ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేసారని మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురింి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా.. కావాలని రాద్దాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు.బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలాం ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన రుషికొండ భవనాల పైన జగన్ తొలి సారి స్పందించారు. ఈ భవనాలను విశాఖ ప్రతిష్ఠ పెంచేందుకు టూరిజం రిసార్ట్స్ గా నిర్మాణం చేసామని వెల్లడించారు. స్టార్ హోటల్లు కాకుండా.. ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్స్ నిర్మించామని చెప్పకొచ్చారు. ఈ భవనాలను అత్యంత అద్బుతంగా సాంకేతికతను వినియోగించి నిర్మాణం చేసామని వివరించారు. అదే విధంగా తమ అయిదేళ్లు పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందని.. అయినా, ఒక లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు. టూరిజం శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఈ రిసార్ట్స్ నిర్మాణం జరిగిందని వివరించారు. రుషికొండ వద్ద టీటీడీ ఆలయం నిర్మించామని గుర్తు చేసారు. భోగాపురం ఏయిర్ పోర్టు వరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు పాత్ర పైన భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు 2004 లో ఓడిపోయిన తరువాత తిరిగి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి లో ప్రమేయం లేదన్నారు. వైఎస్సార్ నాడు పీవీ ఎక్స్ ప్రెస్ వే, మెట్రో, శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ ఎగుమతుల్లో తన మార్క్ చూపించారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కేసీఆర్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. విశాఖలో గుగూల్ డేటా కేంద్రం వెనుక ఆదానీ భారీ పెట్టుబడి ఉందని.. పర్యావరణ కారణాలు ఉన్నా.. ఏఐ , క్వాంటమ్ మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు. తమ హయాంలో మొదలు పెట్టిన ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని జగన్ స్పష్టం చేసారు.

ప్రస్తుత ప్రభుత్వం కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని గుర్తు చేసారు. 52 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ ఎంప్లాయిస్ పైన వీరి కన్ను పడిందని.. ఏం చేస్తారో అంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు డీఏ పైన అర్దం లేని జీవోలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని చెప్పారు. విద్యార్ధుల ఫీ రీయంబర్స్ మెంట్ ఆగిపోయిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేసాయని చెప్పారు. 5 కోట్లు టర్నోవర్ లేని సంస్థకు 104, 108 అంబులెన్సుల బాధ్యత అప్పగించారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలనే లక్ష్యంతో తాము పోరుబాట కొనసాగిస్తామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications