అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పారిశ్రామికాభివృద్దిలో ఏపీ టాప్-కరోనాలోనూ మేటి-చంద్రబాబుతో పోలికా ? జగన్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై అసెంబ్లీలో చర్చకు ముగింపునిస్తూ సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు.పారిశ్రామికంగా, ఉద్యోగాల పరంగా ఎలాంటి అడుగులు పడ్డాయి, వాటి ద్వారా రాష్ట్రానికి ఎలాంటి మంచి జరిగిందనే దానిపై చర్చిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు వంటి అంశాలపై జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

రాష్ట్రంలో పరిశ్రమలు

రాష్ట్రంలో పరిశ్రమలు

రాష్ట్రానికి వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్రం ముందుకొచ్చిందని, 17 రాష్ట్రాలు దీని కోసం పోటీ పడ్డాయని జగన్ తెలిపారు. గుజరాత్, ఏపీ, హిమాచల్ రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం వీటిని కేటాయించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇవ్వొద్దంటూ టీడీపీ ఎమ్మెల్సీ యనమల కేంద్రానికి లేఖ రాశారని, టీడీపీ నుంచి మరో లేఖ రాశారని, విపక్షం ఏ స్ధాయికి దిగజారిందో దీన్ని బట్టి అర్ధమవుతోందన్నారు.

గతంలో దివీస్ ఫార్మా సంస్ధను చంద్రబాబు తెచ్చారని, అప్పుడు ఫార్మా కంపెనీ వస్తే కాలుష్యం వస్తుందని చంద్రబాబుకు గుర్తురాలేదా అని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు పైప్ లైన్ కూడా వేసి కాలుష్యం మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయినా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ప్రత్యక్ష్యంగా పరోక్షంగా 30 వేల ఉద్యోగాలు వచ్చే ఈ పార్క్ ను అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాకు ఇది ఎందుకివ్వరని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని, మహారాష్ట్ర సీఎం కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారని జగన్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలు పోటీ పడి అడుగుతున్న పార్క్ ను వైసీపీ కష్టపడి దక్కించుకుంటే దాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు.

 ఈజ్ ఆఫ్ డూయింగ్

ఈజ్ ఆఫ్ డూయింగ్

ఏపీలో మీడియా పోలరైజ్ అయిపోయిందని జగన్ ఆక్షేపించారు. చంద్రబాబు సీఎంగా లేడు కాబట్టి, ఆయన్ను ఎలాగైనా సీఎం స్ధానంలో కూర్చుబెట్టాలని రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో కంటే వైసీపీ పాలనలోనే మెరుగ్గా ఉందని కాగ్ ఇచ్చిన నివేదికల్ని బయటపెట్టామన్నారు. ఇంతలా బయటపెట్టినా, చంద్రబాబు కంటే ఎల్లో మీడియా సంస్ధలు ఎక్కువగా కోపగించుకుంటున్నాయన్నారు.

బాబు మీద ఈగ వాలినా వీరికి కోపం వచ్చేస్తుందని జగన్ తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామికాభివృద్ది జరుగుతోందని చెప్పడానికి గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రస్ధానంలో ఉండటమే నిదర్శనమని సీఎం జగన్ తెలిపారు. దావోస్ కు చంద్రబాబు వెళ్లి తెచ్చిన పెట్టుబడుల కంటే తాను వెళ్లి తెచ్చిన పెట్టుబడులే ఎక్కువన్నారు. పారిశ్రామిక వేత్తల్లోనూ తన వారికి ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదన్నారు. తాము మాత్రం అందరినీ ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఈ మూడేళ్లుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ.2200 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామన్నారు. గ్రానైట్ పరిశ్రమకు కూడా తాజాగా ప్రోత్సాహకాలు ప్రకటించామన్నారు. స్ధానికులకు ఉద్యోగాలపై ఇప్పటికే చట్టం చేశామన్నారు.

 ఏపీ నంబర్ వన్

ఏపీ నంబర్ వన్

విద్యుత్, కనెక్టివిటీ కోసం ఇప్పటికే పారదర్శక విధానం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నిజాయితీగా తాము చేయగలిగినది, చేయలేనిది స్పష్టంగా చెప్తున్నామన్నారు. దీంతో పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు. గతంలో రాష్ట్రంవైపు చూడని పారిశ్రామిక దిగ్గజాలు, సంస్ధలు సైతం ఇక్కడికి వస్తున్నాయన్నారు.

బజాంకా, బిర్లాలు, మిట్టల్, టాటాలు వంటి వారు రాష్ట్రానికి వస్తున్నారని జగన్ గుర్తుచేశారు. వారికి పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. వీరికి గతంలో ఆ విశ్వాసం ఎందుకు రాలేదని, ఇప్పుడు ఎందుకు వస్తోందన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు. వీరంతా చంద్రబాబు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో అద్దెకోట్లు వేసుకున్న నకిలీ పారిశ్రామిక వేత్తలు కాదన్నారు.

కోవిడ్ సమయంలో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహణ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచిందని జగన్ తెలిపారు. 15 రంగాల్లో 301 సంస్కరణలు వందశాతం మార్పులు పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగానే ఇచ్చినందుకు ఈ ర్యాంక్ వచ్చిందన్నారు. టాప్ అచీవర్స్ లోనూ 97.98 శాతంతో ఏపీ అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రంలో 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు చూస్తే అందులో 11.43 శాతంతో దేశంలోనే నంబర్ వన్ గా ఏపీ నిలిచిందన్నారు.

 రాష్ట్రానికి పెట్టుబడులివే

రాష్ట్రానికి పెట్టుబడులివే

2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టువరకూ ఉత్పత్తి ప్రారంభించిన భారీ పరిశ్రమలు 99 అని జగన్ తెలిపారు. వీటిలో 48 వేల కోట్ల పెట్టుబడులు, 60 వేల ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. సూక్ష, మధ్యతరహా పరిశ్రమలు 35181 ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. వీటిలో పెట్టుబడులు 9742 కోట్లు అయితే, వాటి ద్వారా 11374 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని చూస్తే 39655 కోట్ల పెట్టుబడులతో మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

78192 ఉద్యోగాలు వీటి ద్వారా రానున్నాయన్నారు. మరో 91129 కోట్ల పెట్టుబడితో వచ్చే 10 ప్రాజెక్టులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఇది కూడా పూర్తయితే మరో 40 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు విశాఖ, కాకినాడ, కృష్ణా, సత్యసాయి జిల్లాల్లో నాలుగు సంస్ధలు హెచ్పీసీఎల్, బీఈఎల్ ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. లక్షా 6 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే వీటి ద్వారా 72900 మంది ఉపాధి,ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

మూడేళ్లలో కోవిడ్ ప్రపంచాన్ని వణికించినా పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల పెరుగుదల నమోదైందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంతో పోలిస్తే మూడేళ్ల వైసీపీ పాలనతో ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు సమకూరాయన్నారు. ఏటా రూ.12702 కోట్ల పెట్టుబడులు వైసీపీ ప్రభుత్వంలో వస్తే, గతంలో చంద్రబాబు హాయంలో ఐదేళ్లకు రూ.59,968 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం కంటే తామే మెరుగ్గా ఉన్నామన్నారు. కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, ఇందులో మౌలిక వసతుల కోసం వెయ్యి కోట్ల గ్రాంట్ ఇస్తున్నారన్నారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, దీని వల్ల 30 వేల ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

 కొత్త పరిశ్రమలు

కొత్త పరిశ్రమలు

కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు, మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో వస్తున్న పార్కులతో రవాణా రంగంలో మార్పులు రాబోతున్నాయని జగన్ తెలిపారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ఏపీలోనే జరుగుతోందన్నారు. పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ చేస్తున్నాయని, ఇందు కోసం స్కిల్ యూనివర్శిటీతో పాటు 30 స్కిల్ సెంటర్లు కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇప్పుడున్న నాలుగు పోర్టులతో పాటు రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, కాకినాడ సెజ్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ పోర్టులుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. వీటితో పాటు 9 ఫిషింగ్ హార్బర్లను కూడా తెస్తున్నామన్నారు.

ఉద్యోగాల కల్పన

ఉద్యోగాల కల్పన

ఏపీలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 3.97 లక్షల ఉద్యోగాలు ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మరో 2.6 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 37 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీటితో పాటు 3.71 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇచ్చామన్నారు. వీటితో కలుపుకుంటే ఇప్పుడు 6.16 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఈ మొత్తం ఉద్యోగాల్లో గ్రామ సచివాలయాల్లోనే 1.2 లక్షల శాశ్వత, 2.6 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీ విలీనంతో 58 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు.

 చంద్రబాబు అన్నింటికీ ఏడుపే

చంద్రబాబు అన్నింటికీ ఏడుపే

చంద్రబాబు, దుష్టచతుష్టయం పరిశ్రమలు వస్తున్నా, ఉద్యోగాలు వస్తున్నా, నగదు బదిలీ జరుగుతున్నా ఏడుస్తారని జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తామన్నా, మూడు రాజధానులు తెస్తామన్నా ఏడుస్తారన్నారు. వర్షాలు బాగా పడి పంటలు పండితే, రిజర్వాయర్లు నిండినా ఏడుస్తారన్నారు. ఇలాంటి ప్రతిపక్షంతో మనం కాపురం చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. ఏపీలో అభివృద్దిలో చంద్రబాబు పోషించిన పాత్ర ఎక్కడంటే నాలుగు ఉదాహరణలు కూడా దొరకవన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడంలో మాత్రం ఉదాహరణలు కోకొల్లలు దొరుకుతాయన్నారు.

రైతుల్ని మోసం చేసింది, పల్లెల్లి దెబ్బతీసింది, కరువుకు కేరాఫ్ అడ్రస్ అంటే బాబే అంటారన్నారు. వాగ్దానాలన్నీ వదిలేసి, మ్యానిఫెస్టోను ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే మనస్తత్వం బాబుదేనన్నారు. మామకు వెన్నుపోటు పొడిచింది బాబేనని, విభజనకు తొలి ఓటు వేసింది కూడా ఆయనేనన్నారు.

English summary
ap cm ys jagan on today made key speech in ap assembly over industrial development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X