వాలంటీర్ల తొలగింపుపై జగన్ ఫస్ట్ రియాక్షన్-అన్నీ అబద్దాలే-ఇదిగో సాక్ష్యం..!
వాలంటీర్లపై చంద్రబాబు అబద్ధాలు చూస్తుంటే అన్యాయం అనిపిస్తోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. 2023 ఆగస్టులో అంటే తమ హయాంలోనే వాలంటీర్ల వ్యవస్థ తీసేశారని అబద్దాలు చెప్తున్నారని జగన్ ఆక్షేపించారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయడం లేదని, 2023 అగస్టులోనే వారిని తొలగించారని చెప్పడం దారుణమన్నారు. ఈ సంవత్సరం వారి కోసం 277 కోట్లు విడుదల చేశారని చెప్తున్న చంద్రబాబు.. వారిని తొలగించారని ఎలా చెప్తారని నిలదీశారు.
వాలంటీర్ల వ్యవస్థకు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చెల్లించిన జీత భత్యాల వివరాలను వైఎస్ జగన్ వెల్లడించారు. ఏ ప్రభుత్వమైనా ఇలా జీతాలు ఇవ్వాలంటే బడ్జెట్ ఆమోదం లేకుండా ఎలా ఇస్తుందని జగన్ ప్రశ్నించారు. హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎలా జీతాలు చెల్లిస్తారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం హెడ్ ఆఫ్ అకౌంట్ లేదని అబద్దాలు చెప్తున్నారన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ల జీత భత్యాలకు సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ వివరాలను జగన్ బయటపెట్టారు.

ఐదేళ్లుగా ప్రతీ ఏటా బడ్జెట్ లో పెట్టి, ఆర్ధిక శాఖ అనుమతితో తాము వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తే అసలు వ్యవస్థే లేదని, అందుకే ఇప్పుడు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. వాలంటీర్లకు ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇంత అన్యాయమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు.












Click it and Unblock the Notifications