కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మస్తాన్‌బాబు కుటుంబానికి జగన్ పరామర్శ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకే దక్కుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చిలీ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదవశాత్తు 10 రోజుల క్రితం మస్తాన్ బాబు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

మస్తాన్ బాబు స్వగ్రమం నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గాంధీజనసంగం. కాగా, మస్తాన్ బాబు స్వగ్రామంలోని ఆయన కుంటుంబసభ్యులను మంగళవారం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి పెద్ద మస్తానమ్మ, సోదరులు పెద్ద మస్తానయ్య, చిన్న మస్తాన్ బాబులను జగన్ పలకరించారు.

మస్తాన్ బాబు మృతి దేశానికి తీరని లోటని చెప్పారు. భావితరాలకు గుర్తుండిపోయేలా ఆయన స్మారకస్తూపం ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మస్తాన్ బాబు కుటుంబసభ్యులకు హామి ఇచ్చారు.

అలాగే మస్తాన్ బు మృతదేహాన్ని చిలీ నుంచి త్వరగా తీసుకొచ్చేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని, అన్ని విధాలా ఆదుకుంటామని మస్తాన్ తల్లి సుబ్బమ్మకు ఫోన్ నెంబర్ ఇచ్చారు.

అంబేద్కర్‌కు నివాళి

అంబేద్కర్‌కు నివాళి

నెల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైయస్ జగన్.

అభిమాన జనం

అభిమాన జనం

తమ అభిమాన నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

మస్తాన్ బాబుకు నివాళి

మస్తాన్ బాబుకు నివాళి

ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకే దక్కుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

కుటుంబానికి పరామర్శ

కుటుంబానికి పరామర్శ

మస్తాన్ బాబు స్వగ్రమం నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గాంధీజనసంగం. కాగా, మస్తాన్ బాబు స్వగ్రామంలోని ఆయన కుంటుంబసభ్యులను మంగళవారం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Tuesday condoled to Malli Mastan Babu family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X