బఫూన్లు, మాట్లాడాలంటేనే..: సభలో ఊగిపోయిన జగన్

హైదరాబాద్: శాసన సభలో శాంతిభద్రతల పైన చర్చ జరుగుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఊగిపోయారు. టీడీపీ సభ్యులు తనపై చేసిన ఆరోపణలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ 'మీలాంటి బఫూన్‌లతో మాటలు అనిపించుకుంటుంటే నాకెలా ఉంటుందంటే.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర కలకలం చెలరేగింది.

మంగలికృష్ణ విపక్ష నేత జగన్‌కు తెలియదా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. దీంతో సంయమనం కోల్పోయిన జగన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. తమను బఫూన్లంటూ వ్యాఖ్యానించడంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్ద ఆందోళన చెపట్టారు. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది.

YS Jagan

అంతకుముందు జగన్ మాట్లాడుతూ.. మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయవ్యవస్థ దిగజారిందన్నారు. తాము హత్యా రాజకీయాలను ఇకపైనైనా కంట్రోల్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతుంటే ఒక్క మంత్రి కూడా ఆ హామీ ఇవ్వడం లేదన్నారు. చనిపోయిన వ్యక్తులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాత్రమే తాము కోరామని దానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు.

వైయస్‌కు ప్రాణాలు పోయడమే తెలుసు

అసెంబ్లీలో చర్చలో టీడీపీ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై హత్యలు ఇకపై కూడా కొనసాగుతాఏమోనని అనిపిస్తోందని కొడాలి నాని అన్నారు. దురుద్ధేశంతోనే పరిటాల రవి హత్యకేసులో జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వృత్తిరీత్యా డాక్టర్ అని, ఆయన ప్రాణాలు పోయడమే తెలుసు కానీ, తీయడం తెలియదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానిదీ ఖూనీలు చేసిన చరిత్ర అని, వంగవీటి రంగా పేరు ఎత్తే అర్హత జగన్‌కు లేదని బొండా ఉమ ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+