దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం: 'వైయస్ జగన్ కావాలనే గొడవ చేశారు'
నందిగామ ఆసుపత్రిలో జగన్ కావాలనే గొడవ చేశారని, తన నిజాయితీ పైన నటి రోజా సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం నాడు అన్నారు.
విజయవాడ: నందిగామ ఆసుపత్రిలో జగన్ కావాలనే గొడవ చేశారని, తన నిజాయితీ పైన నటి రోజా సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం నాడు అన్నారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జగన్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కామినేని స్పందించారు.
ప్రమాదాన్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులతో జగన్ తీరు చాలా బాధాకరమన్నారు. తన నిజాయితీ పైన వైసిపి ఎమ్మెల్యే సర్టిఫికేట్ అవసరం లేదన్నారు.

వైసిపి నేతలు కూడా జగన్ అలాగే: గంటా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జగన్ లాగే వ్యవహరిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి పైన అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధఇ చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications