వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో కుమ్మక్కు నేనా, చంద్రబాబా: మీడియాతో జగన్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని, తనను తెలుగుదేశం పార్టీ నాయకులతో తిట్టించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శించారు.

శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన మంగళవారం లోటస్ పాండ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడరాు. ప్రతిపక్షమైన తమ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని, అందువల్లనే కీలక అంశాలపై చర్చను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.

సభలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని, తనను చంద్రబాబు తిట్టిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. కాల్వ శ్రీనివాసులు, ధూళిపాళ్ల తదితరును ఇదే పని మీద ఉంటారని ఆయన అన్నారు. కృష్ణానది మిగులు జలాలను వాడుకునే హక్కు మనకుందని వైయస్ జగన్ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా టిడిపి ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

శానససభలో అధికార తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై వైయస్ జగన్ మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కీలకమైన అంశాలపై చర్చ జరగకుండా చూస్తోందని ఆయన అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

తమ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని, తనను తిట్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని జగన్ విమర్శించారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

ప్రజా సమస్యలను వినే ఓపిక, తీరిక అధికార టిడిపికి లేదని ప్రతిపక్షథ నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శించారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలపై చర్చ జరగకుండా అధికార పక్షానికి చెందిన శాసనసభ్యులు అడ్డుకున్నారని జగన్ అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరగకుండా అధికార టిడిపి సభ్యులు అడ్డుకున్నారని, ఆ ప్రాజెక్టు వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని జగన్ అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభలో వ్యవహరిస్తున్న తీరును తాను మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు జగన్ చెప్పారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

పట్టి సీమ ప్రాజెక్టును ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో వినే ఓపిక ప్రభుత్వానికి గానీ, అసెంబ్లీ స్పీకర్‌కు గానీ లేదని జగన్ అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకు నీల్లు అందుతాయని జగన్ తెలిపారు. సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు గడిచినా బడ్జెట్‌పై చర్చించే అవకాశామే ఇవ్వలేదని జగన్ తప్పు పట్టారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తాను కుమ్మక్కయ్యానని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారని, కెసిఆర్‌తో కుమ్మక్కయింది చంద్రబాబు నాయుడేనని జగన్ అన్నారు.

మీడియాతో జగన్

మీడియాతో జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం అడుగుతున్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

English summary
Andhra Pradesh opposition leader and YSR Congress party president YS Jagan deplore the attitude of AP CM Nara Chandrababu Naidu and TDP members in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X