గేరు మార్చిన జగన్, ఇక ప్రజల్లోనే - ముహూర్తం ఫైనల్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇటు మాజీ సీఎం జగన్ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టారు. వైసీపీ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో ఆ పార్టీ నేతల పైన వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో, జగన్ తాజాగా పార్టీ ముఖ్యలతో చర్చల వేళ కీలక నిర్ణయం దిశా నిర్దేశం చేసారు. తాజాగా వక్ప్ బిల్లుపై సుప్రీంకు వెళ్లటం సంచలనంగా మారుతోంది. అదే సమయంలో జిల్లాల పర్యటనలు ప్రారంభించటం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ తాజా నిర్ణయం
ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కొంత కాలం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీకి దూరమయ్యారు. మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు. కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని.. ఆ తరువాతనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కొంత కాలం క్రితం జగన్ జిల్లాల పర్యటనలతో కార్యకర్తలతో మమేకం కావాలని భావించారు. అయితే, కొద్ది సమయం తీసుకున్న తరువాత జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందనే సూచనతో జనవరిలోనే ప్రారంభం కావాల్సిన జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి.కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నేతల పైన కేసులు నమోదు చేయటం.. వైసీపీ లక్ష్యంగా వ్యవహరి స్తున్న తీరు పైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించారు.

తెగించాల్సిందే..
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు ను వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లటం ద్వారా జగన్ ఇక రాజకీయంగా తేల్చుకొనేందుకు జగన్ ఇక ప్రజల్లోనే ఉండాలని కొందరు నేతలు సూచించగా.. మరి కొందరు కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగు తోందని.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పర్యటనల కంటే రానున్న రోజుల్లో మరింతగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఢిల్లీ కేంద్రంగా..
వైసీపీ ఎంపీలు బీజేపీ లో చేరుతున్న అంశం పైన జగన్ నేరుగా స్పందించ లేదు. అయితే, బీజేపీ ఏపీలో చేస్తున్న రాజకీయం పైన మాత్రం అలర్ట్ అయ్యారు. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండ టంతో టీడీపీ, జనసేన తరహాలోనే బీజేపీతోనూ వ్యవహరించాలని నిర్ణయించారు. ముందుగా పార్టీ నేతల పైన కేసు విషయాలపై జగన్ ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. జూన్ రెండో వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఈ సమయంలో నే ప్రభుత్వం పైన ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగటం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications