హీరోలా కనిపించడం కోసం, ఆ ప్లైట్ ఎక్కుతావా: ఆళ్లగడ్డలో బాబు- అఖిలను టార్గెట్ చేసిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మంత్రి అఖిలప్రియను టార్గెట్ చేసారు. అఖిలప్రియ వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మంత్రి అఖిలప్రియను టార్గెట్ చేసారు. అఖిలప్రియ వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.
Recommended Video

ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల కృష్ణానదిలో బోటు మునిగి ఇరవై మందికి పైగా మృతి చెందారు. దీంతో జగన్ ఆమెను టార్గెట్ చేశారు. అఖిలప్రియ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ ముందుకు తీసుకు వచ్చారు.

బాబు, అఖిలప్రియ రాజీనామా చేయాలి
ఆయన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫెర్రీ బోటు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రతిపక్ష నేత ప్రశ్నించాహరు.

అవి ఏమయ్యాయి
నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి ఘటన, మెడికో ఆత్మహత్యపై కమీషన్లు ఏమయ్యాయో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల మాదిరిగా కొంటున్నారని మండిపడ్డారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు హీరోలా కనిపించడం కోసం
పుష్కరాల సమయంలో సినిమా షూటింగ్‌లో హీరోలా కనిపించడం కోసం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో వీఐపీ ఘాట్‌లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్‌కు వెళ్లి స్నానం చేశారని జగన్ మండిపడ్డారు. షూటింగులో ఎఫెక్టు కోసం అన్నట్లు ఒక్కసారిగా భక్తులను ఘాట్‌లోకి వదిలారని, ఫలితంగా జరిగిన తొక్కిసలాటకు సీఎం బాధ్యులు కారా అని నిలదీశారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు వేసిన కమిషన్ల నివేదికలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఇంటికి కూత వేటు దూరంలో ప్రమాదం
కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు ఉంటున్నారని, ఇంటికి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగితే స్పందించ లేదని జగన్ మండిపడ్డారు. ఏమన్నా అంటే బోటు డ్రైవర్‌కు లైసెన్సు లేదంటున్నారని విమర్శించారు.

బాబు, లోకష్ ఎక్కిన విమానంలో లైసెన్స్ లేని పైలట్ ఉంటే
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్కిన విమానంలో లైసెన్సు లేని పైలట్ ఉంటే అప్పుడు పడవ మునక బాధితుల బాధ ఏమిటో వారికి తెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.

ఆళ్లగడ్డలో పాదయాత్ర
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ జగన్ పాదయాత్ర కొనసాగింది. కృష్ణాపురం నుంచి మొదలైన పాదయాత్ర పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదుగా 11.5 కి.మీ. మేర పాదయాత్ర సాగింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications