డ్యాన్స్‌లూ స్టెప్పులూ చంద్రబాబు యోగా: జగన్
హైదరాబాద్: అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది తెులుగు కాంగ్రెసు ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 గురించి వివరిస్తూ ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ఉన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 వంటిదే చంద్రబాబు ఇప్పుడు జారీ చేసిన 22 నెంబర్ జీవో అని, ఆ జీవో కన్నా ఈ జీవో మరింత దారుణంగా ఉందని ఆయన అన్నారు.
22 నెంబర్ జీవో రాష్ట్రాన్ని అమ్మేసే జీవో అని ఆయన అన్నారు. ఈ జీవోలో భయానక సత్యాలు ఉన్నాయని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా కరెంట్ చార్జీలు పెంచినప్పుడు చంద్రబాబు నాయుడే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని మరీ విప్ జారీ చేసి కాపాడారని ఆయన చెప్పారు. మెజారిటీకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇద్దరు సభ్యులు తక్కువగా ఉన్న స్థితిలో చంద్రబాబు మద్దతు ఇచ్చి కాపాడారని ఆయన అన్నారు. చంద్రబాబు మద్దతు ఇవ్వకపోయి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడి పోయి ఉండేదని ఆయన అన్నారు. అందుకే తాను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెసు తెలుగు ప్రభుత్వమని అంటున్నట్లు ఆయన తెలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో 13వ నెబర్ జీవోను జారీ చేసిననప్పుడు కొంత మంది మంత్రులే అభ్యంతరం చెప్పడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కన పెట్టారని, గవర్నర్ కూడా దాన్ని పక్కన పెట్టారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ పక్కన పెట్టిన జీవోను చంద్రబాబు ఉపసంహరించుకుని 22 నెంబర్ జీవోను జారీ చేశారని ఆయన చెప్పారు. ఓ వైపు డబ్బులు లేవని అంటూనే మరో వైపు 2013 నుంచి ఆ జీవోను అమలు చేస్తూ జారీ చేశారని ఆయన చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లించే సొమ్మును పెంచుతూ, పలు వెసులుబాట్లు కల్పిస్తూ జీవో చేశారని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లతో పనులు చేయించుకోవాల్సింది పోయి వెసులుబాట్లు కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇసుక మాఫియా మూడు రకాలుగా జరుగుతోందని ఆయన అన్నారు. తమకు చెందినవారికే ఇసుక కాంట్రాక్టర్లు ఇచ్చుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. మార్కెట్ ధరకు తక్కువగా హెరిటేజ్ కంపెనీకే చెక్కు ఇచ్చేశారని ఆయన అన్నారు. చంద్రన్న ధర అలా ఉందని ఆయన అన్నారు.
మామూలు విమానం ఎక్కరని, చంద్రన్న యోగా క్లాసులు పెడుతారని, యూట్యూబ్‌లో చంద్రబాబు డ్యాన్స్‌లు స్టెప్పులు హిట్టయ్యాయని ఆయన అన్నారు. యోగాకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, రూపాయి తీసుకోకుండా యోగా నేర్పించేవారున్నారని ఆయన చెప్పారు. డ్యాన్స్‌లు, స్టెప్పులేయడం నేర్పించినందుకు అంతగా చెల్లింపులు జరిపి ఉంటారు కావచ్చునని ఆయన అన్నారు. సచివాలయానికి మరమ్మత్తులు చేయించుకోవడానికి ఖర్చు చేశారని ఆయన అన్నారు. ఓ వైపు డబ్బులు లేవంటూనే అనవసరమైన ఖర్చులు పెడుతున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి జీవోలు జారీ చేస్తారని ఆయన అన్నారు. విచ్చలవిడిగా అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు.
చంద్రబాబు మాటలూ చేతలూ పాతవేనని, అవే విజన్ మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అవే కన్సల్టెన్సీలు, వాటికి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వాటి పేర్లు మారవచ్చునని ఆయన అన్నారు. మళ్లీ అవే సింగపూర్ పర్యటనలని ఆయన అన్నారు. అవే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యోగుల్లో అదే అభద్రతా భావం, రైతుల్లో అదే భయం చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. రెవెన్యూ లోట్లు అవేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడల్లా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.
చంద్రబాబు మార్కు పాలన వచ్చిందని ఆయన అన్నారు. కరెంట్ చార్జీలు పెంచుతారని భయం వేస్తోందని ఆయన అన్నారు. రైతుల్లో, డ్వాక్రా మహిళల్లో, విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో, వృద్ధుల్లో చివరకు రాజధాని నిర్మాణం అంటూ సంక్షోభం సృష్టించారని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఆస్తులూ అప్పుల నిష్పత్తి చూస్తే, దిగిపోయేటప్పుడు అప్పులు విపరీతంగా పెరిగి ఉంటాయని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షం చెప్పే మాటలను విని బడ్జెట్‌లో సవరణలు చేస్తే మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications