బాబు వర్సెస్ కేసీఆర్‌పై జగన్ దూరం! అనువుగానిచోట మేకపాటి వ్యాఖ్య
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారాన్ని వదిలేద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల మధ్య ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై వివాదం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఓటుకు నోటు వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఏపీలో దోచుకొని తెలంగాణలో టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు కాపాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు.
అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి, పలువురు అధికారులకు ఏపీ నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగాత ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ భావిస్తున్నందున దానిని వదిలేయాలని చూస్తోందని తెలుస్తోంది.
అంతేకాదు, దీనిపై పదేపదే మాట్లాడుతున్నందువల్ల ఏపీలో జగన్ పైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజలు జగన్ తీరును ప్రశ్నిస్తున్నారని, విభజనకు కారకుడైన, ఏపీని టార్గెట్ చేసుకున్న కేసీఆర్‌కు జగన్ మద్దతు పలుకుతున్నారని టీడీపీ చెబుతోంది. దీనిని ప్రజల్లోకి కూడా సిద్ధమైంది. దీంతో వైసీపీ పునరాలోచన చేసి ఉండవచ్చునని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోను కేసీఆర్ పైన ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది.
అనువుగాని చోట మేకపాటి వ్యాఖ్యలు!
చంద్రబాబు సముద్రాలు ఈది మురుగుకాల్వలో పడినట్లు కేసీఆర్ చేతుల్లో ఇరుక్కుపోయారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాజీ మంత్రి సంతాప సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, సంతాప సభలో రాజకీయాలు ఏమిటని టీడీపీ హితవు పలికింది.












Click it and Unblock the Notifications