Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YSR jayanti: నాన్నా.. అంటూ వైఎస్ జగన్ భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

వైఎస్సార్ జయంతి .. జగన్ ఎమోషనల్ ట్వీట్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రితో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. వైయస్ఆర్ జయంతి నాడు ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నాన్నా... మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు అంటూ పేర్కొన్నారు. కోట్లాది కుటుంబాలు ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు జగన్.

YS Jagan emotional tweet on YSR on YS rajasekhar reddy 75th Jayanti

మీరు చూపించిన ధైర్య సాహసాలు మాకు మార్గం
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నారని పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో ఎమోషనల్ అయిన వైయస్ జగన్ ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం అంటూ పేర్కొన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోరశ్రమ, రాజకీయాలలో మీరు చూపించిన ధైర్య సాహసాలు మాకు మార్గం అంటూ వెల్లడించారు.

తండ్రి అడుగుజాడల్లో జగన్: నెటిజన్ల స్పందన
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి సాగుతుంది అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక తండ్రి అడుగుజాడల్లో జగన్ అంటూ వైసీపీ అభిమానులు జగన్ పెట్టిన పోస్ట్ పైన స్పందిస్తున్నారు. మహానేత మార్గాన్ని అనుసరిస్తున్న మా నేత జగన్ అంటూ పలువురు ఆయనపై అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

దివంగత మహానేతకు నివాళులు
కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో పాలనలో తన మార్క్ చూపించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి, తల్లి విజయమ్మతో పాటు పలువురు కుటుంబ సభ్యులు దివంగత మహానేతకు నివాళులర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+