జగన్ ఆమరణ దీక్షకు టి నుండి మద్దతు కరువైందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్షకు తెలంగాణ జిల్లాల నుండి మద్దతు కరువైందంటున్నారు. జగన్ సమైక్యాంధ్ర కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు వరంగల్ జిల్లా నుండి ఇద్దరు నేతలు మాత్రమే వచ్చి సంఘీభావం తెలిపారట.
మాజీ మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వరంగల్‌తో పాటు పలు తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీకి క్యాడర్ ఉంది. అయితే జగన్ సమైక్యం కోసం దీక్ష చేస్తున్నందున పలువురు దూరంగా ఉంటున్నారంటున్నారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు పార్టీ నాయకులు జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ధైర్యం చేశారంటున్నారు.

గతంలో జగన్ హైదరాబాదు, నిజామాబాద్ జిల్లాల్లో దీక్ష చేసినప్పుడు ఆ పార్టీ క్యాడర్ భారీ ఎత్తున తరలి వచ్చింది. ఇప్పుడు పూర్తిగా సమైక్యాంధ్ర అంటుండటంతో హైదరాబాదులో చేస్తున్న ఈ దీక్షకు ఆయా నియోజకవర్గాల ఇంఛార్జులు సైతం కార్యకర్తలను తరలించేందుకు ఆసక్తి చూపించడం లేదట.
మరోవైపు జగన్ దీక్షకు వరంగల్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుండి మద్దతు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తల రాక క్రమంగా పుంజుకుంటుందని మరికొందరు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు దీనిపై చర్చిస్తున్నారట.












Click it and Unblock the Notifications