పాదయాత్ర చేస్తున్నా, ప్రతి శుక్రవారం కోర్టుకు రాలేను: కోర్టులో జగన్ పిటిషన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవంబర్ 2వ తేదీ నుంచి తాను ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, కాబట్టి తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన అందులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను సిబిఐ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, జగన్ నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications