తన పైన కేసుల నమోదు వేళ జగన్ సంచలన నిర్ణయం..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల పైన నమోదవుతున్న కేసుల పై జగన్ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జగన్ పల్నాడు పర్యటన వివాదాస్పదంగా మారింది. జగన్ కారు కింద పడి సింగయ్య మరణించినట్లు తేల్చారు. ఈ కేసులో ఏ-2గా జగన్ పేరు చేర్చారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్.. తన పైన నమోదైన కేసుల విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు.

జగన్ పై కేసుతో
మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ పల్నాడు పర్యటన సమయంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా.. జగన్ తన కాన్వాయ్ తో పాటుగా వంద మందితో మాత్రమే పర్యటన పూర్తి చేయాలని నిర్దేశించారు. అయితే, జగన్ తన నివాసం నుంచి పల్నాడు వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య అభివాదం చేస్తూ పర్యటన కొనసాగిం చారు. కాగా, ఈ పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త మరణించారు. సింగయ్య మరణం పైన విచారణ చేసిన పోలీసులు ఆయన జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసారు.

ys-jagan-files-quash-petition-in-singaiah-death-case-details-here

హైకోర్టుకు జగన్
ఈ కేసులో భాగంగా జగన్ ప్రయాణించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. జగన్ తో పాటుగా పార్టీ నేతలకు నోటీసులు జారీ చేసారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం వచ్చే నెల నుంచి ప్రతీ ఇంటికి తమ ఎమ్మెల్యేలను పంపాలని.. తాము సాధించిన విజయాలను వివరించాలని నిర్ణయించింది. దీనికి కౌంటర్ గా రీకాల్ చంద్రబాబు అనే నినాదంతో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ.. ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్నికల హామీల విస్మరణ గురించి పార్టీ నేతలు వివరించేలా జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇదే సమయంలో తన పైన కేసుల పైన హైకోర్టుకు వెళ్లారు. తన పైన నమోదైన కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

రేపు విచారణ
జగన్ తో పాటుగా ఈ కేసులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు సైతం క్వాష్ పిటీషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రేపు (గురువారం) ఈ పిటీషన్లు విచారణకు రానున్నాయి. కాగా, తన కారు కింద పడి సింగయ్య మరణం.. బయటకు వచ్చిన వీడియో పైన జగన్ స్పందించారు. ప్రభుత్వం పైన విమ ర్శలు చేసారు. సింగయ్య కుటుంబానికి వైసీపీ నుంచి రూ 10 లక్షల ఆర్దిక సాయం అందించారు. ఇక, ఇప్పుడు రాజకీయంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే... కేసులను ఎదుర్కోవాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ పిటీష న్ పైన విచారణ చేసిన తరువాత తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+