Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YS Jagan : నీతి ఆయోగ్ భేటీలో జగన్ చెప్పబోయేది ఇదే..

ఈనెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ హాజరు కానున్నారు. ఈ భేటీలో చర్చించనున్న అంశాలపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ సమీక్షించారు.
వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు-పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, మరియు సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై నీతిఆయోగ్‌ పాలక మండలి చర్చించబోతోంది.

నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని జగన్ నిర్ణయించారు. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనున్నారు.నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై వివరించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకంపై వివరిస్తారు.

YS Jagans attempt for kurnool district tdp leaders

104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను కూడా జగన్ వివరించనున్నారు. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ల్‌ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో కూడా వివరిస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్‌ చేయడం అన్నది చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలన్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై జగన్ చర్చించారు. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య-ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్నారు. తల్లిగర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్‌ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి సులభతరం అవుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్‌ చేయడం కూడా సులభతరం అవుతుందన్నారు.

నీతి ఆయోగ్ భేటీలో మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను కూడా జగన్ వివరిస్తారు. బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని వివరించనున్నారు. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏరకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో వివరించనున్నారు. మహిళా సాధికారిత దిశలో చేయతతోపాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను వివరించనున్నారు. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరిస్తారు. దాదాపు 30వేలకుపైగా ఇంటర్‌వెన్షన్స్‌ జరిగిన విషయాన్ని హైలెట్‌ చేయనున్నారు.

YS Jagan

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారు. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవలన్నారు. ప్రతి జిల్లాకేంద్రంలో కూడా ఒక స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలన్నారు.

స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయని, ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారని జగన్ తెలిపారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదన్నారు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి :
ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయన్నారు. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించనున్నారు.

అలాగే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగంలో సాధించిన ప్రగతిని కూడా నీతి ఆయోగ్ భేటీలో జగన్ వివరిస్తారు.
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనున్నారు.10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని వివరించనున్నారు.
కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని
చెబుతారు. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ, నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టుపైనా వివరిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+