భయమే, అప్పులపాలు: బాబు పాలనపై జగన్(పిక్చర్స్)

కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి 9ఏళ్ల పాలన భయానకమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు, పెద్దటేకూరు, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి మీదుగా పత్తికొండ, అప్సరిలో రోడ్ షో నిర్వహించారు. అప్సరిలో నిర్వహించిన వైయస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకున్నారని జగన్ ఆరోపించారు. పేదోడికి రోగమొస్తే.. కుటుంబ సభ్యులు అప్పులపాలయ్యారని అన్నారు. మద్యపాన నిషేధం ఎత్తేశారని విమర్శించారు. అధికారం కోసం ఇప్పుడు రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు చాలా హామీలిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదని జగన్ ప్రశ్నించారు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంతకాలు, ఆరు పనులతో రాష్ట్ర దశ, దిశ మారుస్తానని తెలిపారు. ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ తెలిపారు. రూ. 100కే 150 యూనిట్ల విద్యుత్ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలుపించుకుని రాష్ట్రంలో మళ్లీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి నాటి సువర్ణయుగం మాదిరిగానే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకుందామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఆమె గుంటూరు జిల్లా నాదెండ్లలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. వైయస్ ప్రారంభించిన పథకాలు ప్రజలకు వైయస్ జగన్ ద్వారానే అందుతాయని తెలిపారు.

రోడ్‌షోకు తరలివచ్చిన జనం

రోడ్‌షోకు తరలివచ్చిన జనం

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు, పెద్దటేకూరు, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి మీదుగా పత్తికొండ, అప్సరిలో రోడ్ షో నిర్వహించారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి 9ఏళ్ల పాలన భయానకమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

సంక్షేమ రాజ్యం

సంక్షేమ రాజ్యం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలుపించుకుని రాష్ట్రంలో మళ్లీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి నాటి సువర్ణయుగం మాదిరిగానే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకుందామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.

అంబేద్కర్‌కు నివాళి

అంబేద్కర్‌కు నివాళి

గుంటూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న విజయమ్మ.

జగన్‌తోనే సంక్షేమం

జగన్‌తోనే సంక్షేమం

గుంటూరు జిల్లా నాదెండ్లలో నిర్వహించిన సభలో విజయమ్మ మాట్లాడుతూ.. వైయస్ ప్రారంభించిన పథకాలు ప్రజలకు వైయస్ జగన్ ద్వారానే అందుతాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+