బాబు పాలనంటే భయం, రాత మారాలి: జగన్(పిక్చర్స్)

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పాలనను తలచుకుంటేనే భయమేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాసల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అనే విషయాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదని అన్నారు. పది మందికి మేలు చేయని బాబు.. ఈనాడు పత్రికలో సొంత డబ్బా కొట్టించుకోవడం ఒకటే తెలుసని ఎద్దేశా చేశారు.

చంద్రబాబులా తాను సాధ్యం కాని హామీలు ఇవ్వడం నాకు చేతకాదని.. ఏ పథకాలైతే అమలు చేస్తానో అవే హామీలు ఇస్తున్నానని జగన్ తెలిపారు. ఈ ఎన్నికలు అయిపోయాక టిడిపి పార్టీ ఉండదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పారు.

టెక్కలి నియోజక వర్గంలోని కాకరాపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్రాల అనుమతులు రద్దు చేస్తానని జగన్ చెప్పారు. మత్స్యకారులను ఎస్టి జాబితాలో చేర్చుతామని హామి ఇచ్చారు. టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపి అభ్యర్థిగా రెడ్డి శాంతి పేర్లను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

బాబు పాలనంటే భయమేస్తోంది: జగన్

బాబు పాలనంటే భయమేస్తోంది: జగన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పాలనను తలచుకుంటేనే భయమేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

చంద్రబాబులా తాను సాధ్యం కాని హామీలు ఇవ్వడం నాకు చేతకాదని.. ఏ పథకాలైతే అమలు చేస్తానో అవే హామీలు ఇస్తున్నానని జగన్ తెలిపారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాసల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించారు.

జిల్లాకో ఆస్పత్రి

జిల్లాకో ఆస్పత్రి

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+