జగన్‌కు 'తెలంగాణ' ఆయుధం: రేవంత్ బాస్ చంద్రబాబే
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన ఆయుధంగా కనిపిస్తోంది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్‌కు రూ.5 కోట్ల డీల్, రేవంత్ తదితరుల అరెస్టుపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది.
ప్రధానంగా ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు తదితరులు నిప్పులు చెరుగుతున్నారు. అంబటి రాంబాబు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబే మొదటి ముద్దాయి అన్నారు. ఈ కేసులో దొరకని దొంగలు ఉన్నారన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అన్నారు. రేవంత్ బాస్ చంద్రబాబే ప్రధాన నిందితుడు అని ఆరోపించారు.

చంద్రబాబు పైన ఏ వన్ కేసు అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఏపీలో దోచుకొని తెలంగాణలో పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. కేసులు తారుమారు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.
కేసీఆర్ వల్లే రేవంత్ వ్యవహారం బయటపడింది: ఉండవల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పూనుకోవడం వల్లే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం బయటపడిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏఫీకి ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్లాలన్నారు.
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications