వైఎస్ జగన్ ట్విస్టు: చంద్రబాబుకు పాత చిక్కులే కొత్తగా...

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార ఢంకా మోగిస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త ట్విస్టు ఇచ్చారు. చంద్రబాబును చిక్కుల్లో పడేసి, హైదరాబాద్ ఓటర్లను వ్యతిరేకంగా మలచడమే ఆయన లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చాలా కాలంగా మరుగున పడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్‌ను జగన్ అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. కాకినాడలో విద్యార్థులు, యువకులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును నిలదీయాలని ఆయన సూచించారు. అలాగే, బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని దుయ్యబట్టారు.

హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు కూడా చంద్రబాబు అండగా నిలబడలేరనే సంకేతాలను ఇవ్వడానికే ఆయన ఆ కార్యక్రమాలను పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలు టిడిపికి ఓటేస్తే మోసపోతారని చెప్పడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. అలాగే, మరో కొత్త విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుకు తెచ్చింది.

 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార ఢంకా మోగిస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త ట్విస్టు ఇచ్చారు. చంద్రబాబును చిక్కుల్లో పడేసి, హైదరాబాద్ ఓటర్లను వ్యతిరేకంగా మలచడమే ఆయన లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా మరుగున పడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్‌ను జగన్ అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. కాకినాడలో విద్యార్థులు, యువకులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును నిలదీయాలని ఆయన సూచించారు. అలాగే, బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు కూడా చంద్రబాబు అండగా నిలబడలేరనే సంకేతాలను ఇవ్వడానికే ఆయన ఆ కార్యక్రమాలను పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలు టిడిపికి ఓటేస్తే మోసపోతారని చెప్పడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. అలాగే, మరో కొత్త విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుకు తెచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ శుక్రవారంనాడు ఆరోపించారు. ఓటు నోటు కేసు నుంచి బయటపడడానికి కేంద్రాన్ని చంద్రబాబు ప్రత్యేక హోదాపై నిలదీయడం లేదని జగన్ చేసిన ఆరోపణ అటు ఉండగానే అదే విషయంపై కెసిఆర్‌తో చంద్రబాబు చేతులు కలిపారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నట్లు అనిపిస్తున్నారు. కెసిఆర్‌కు గానీ తెరాసకు గానీ వ్యతిరేకంగా ఉన్న హైదరాబాదులోని సీమాంధ్ర ఓటర్లు దానిపై ఆలోచించే దిశగా బొత్స సత్యనారాయణ వ్యాఖ్య ఉందని అంటున్నారు. కెసిఆర్‌తో చంద్రబాబు కలిసిపోయినప్పుడు తాము కలిసిపోతే నష్టమేమిటని, కెసిఆర్‌ను వ్యతిరేకించడానికి చంద్రబాబును బలపరిచే కన్నా తామే తెరాస వైపు ఉంటే పోతుంది కదా అనే ఆలోచనకు హైదరాబాద్ సీమాంధ్ర ఓటర్లు అనుకుని పరిస్థితి వచ్చింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ శుక్రవారంనాడు ఆరోపించారు. ఓటు నోటు కేసు నుంచి బయటపడడానికి కేంద్రాన్ని చంద్రబాబు ప్రత్యేక హోదాపై నిలదీయడం లేదని జగన్ చేసిన ఆరోపణ అటు ఉండగానే అదే విషయంపై కెసిఆర్‌తో చంద్రబాబు చేతులు కలిపారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నట్లు అనిపిస్తున్నారు.

కెసిఆర్‌కు గానీ తెరాసకు గానీ వ్యతిరేకంగా ఉన్న హైదరాబాదులోని సీమాంధ్ర ఓటర్లు దానిపై ఆలోచించే దిశగా బొత్స సత్యనారాయణ వ్యాఖ్య ఉందని అంటున్నారు. కెసిఆర్‌తో చంద్రబాబు కలిసిపోయినప్పుడు తాము కలిసిపోతే నష్టమేమిటని, కెసిఆర్‌ను వ్యతిరేకించడానికి చంద్రబాబును బలపరిచే కన్నా తామే తెరాస వైపు ఉంటే పోతుంది కదా అనే ఆలోచనకు హైదరాబాద్ సీమాంధ్ర ఓటర్లు అనుకుని పరిస్థితి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+