విమానం మిస్: రోడ్డు మార్గాన గుంటూరుకు బయల్దేరిన వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరవధిక దీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దీక్ష కోసం బుధవారం ఉదయం హైదరాబాదు నుంచి జగన్ విజయవాడ బయలుదేరారు.
హైదరాబాదు నుంచి విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ.. విమానం మిస్ కావడంతో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన గుంటూరుకు బయల్దేరారు.

హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి జగన్ రోడ్డు మార్గం మీదుగా విజయవాడ బయలుదేరారు. విజయవాడలో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత గుంటూరు పరిధిలోని నల్లపాడులో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి చేరుకుంటారు.

గుంటూరులోని నల్లపాడులో బుధవారం ఉదయం 10.30 గంటలకు జగన్ దీక్ష ప్రారంభం కానుంది. జగన్ దీక్షకు సంఘీభావంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగనున్నారు.












Click it and Unblock the Notifications