దసరా శుభాకాంక్షలు, జ్యోతులకు జగన్ పరామర్శ
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
చెడు ఎంత దుర్మార్గమైనా, అంతిమ విజయం మాత్రం మంచిదేనని వైయస్ జగన్ చెప్పారు. లోకంలోనని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత, రాష్ట ప్రజలకు కూడా సుఖశాంతులను అందించాలన్నారు.

జ్యోతుల నెహ్రును పరామర్సించిన వైయస్ జగన్
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైయస్ జగన్ ఫోన్ లో పరామర్సించారు. గత కొన్నిరోజులుగా జ్యోతుల నెహ్రు అస్వస్దతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications