ఏమిటో జగన్ చెప్పరు, చంద్రబాబు వెక్కిరించారు: జైపాల్
అదిలాబాద్: తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం ఖాయమని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమన్యాయం అవతారం ఏమిటో చెప్పడం లేదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి బుధవారం విమర్శించారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన కాంగ్రెసు పార్టీ కృతజ్ఞత సభలో జైపాల్ మాట్లాడారు. 2009 డిసెంబర్ 8న తెలంగాణ బిల్లు పెట్టండి మద్దతిస్తామని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హేళన చేశారని, వెక్కిరించారన్నారు.
ఆ తర్వాత రెండు రోజులకే ఆయన వెనక్కి తగ్గారన్నారు. తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేసిన వారికి కృతజ్ఞతలు అన్నారు తెలంగాణ అరవయ్యేళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమన్నారు. కాంగ్రెసు పార్టీ, సోనియా గాంధీ వీరోచిత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి నిర్ణయం ఆమెకు తప్ప మరెవరికీ సాధ్యం కాదన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు మరువలేమన్నారు.

సీమాంధ్ర నేతల వల్ల సోనియా నాలుగేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోయారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన 2009 ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని అయితే సీమాంధ్ర ప్రాంత ఇబ్బందులను, ఆందోళనలను తొలగించాలన్నారని గుర్తు చేశారు. ఆయన చనిపోయాక ఆయన పేరుతో వచ్చిన జగన్ పార్టీ సమన్యాయం అంటూ తప్పుదారి పట్టిస్తోందన్నారు.
సమన్యాయం అంటే ఏమిటో, దాని అవతారం ఏమిటో చెప్పాలన్నారు. అదేమైనా బ్రహ్మపదార్థమా, దానికి రూపం లేదా, మన శాస్త్రాల్లో ప్రతి మాటకు నిర్వచనం ఉంటుందని, సమన్యాయంకు ఉన్న నిర్వచనం ఏమిటో మాత్రం జగన్ చెప్పడం లేదన్నారు. ఆయన చెప్పక పోవడానికి ఓ కారణముందని అది ఆయనకు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదన్నారు. జగన్ పార్టీ ఇప్పుడు తాము తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్నారు.
యూపిఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని ఉందన్నారు. సోనియా తెలంగాణకో, సీమాంధ్రకో చెందిన వారు కాదని ఆమె భారత దేశానికి చెందిన వారన్నారు. రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్న త్యాగశీలి అన్నారు. తెలంగాణ రాదని ఇప్పటికీ సీమాంధ్రులు చెబుతున్నారని కానీ, బిల్లు వస్తే సరిపోతుందన్నారు. ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందన్నారు. అసెంబ్లీలో బిల్లుకు మెజార్టీ ఉన్నా లేకున్నా ఆగదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications