జగన్ హెలికాఫ్టర్ ఘటన- కీలకంగాా పైలట్, కోపైలట్ వాంగ్మూలాలు..!

ఏపీలో ఈ నెల 8న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో ఆయన హెలికాఫ్టర్ పైకి జనం ఎగబడ్డారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఈ ఘటనతో జగన్ భద్రతా లోపాలు బయటపడ్డాయి. దీనిపై వైసీపీ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆ రోజు హెలికాప్టర్ నడిపిన పైలట్, కో పైలట్ కు విచారణకు రావాలని సత్యసాయి జిల్లా సీకే దిన్నె పోలీసులు నోటీసులు పంపారు. దీంతో వారు ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 8న జగన్ ను పైలట్, కోపైలట్ హెలికాప్టర్ లో పాపిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ ను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ ద్వంసం అయింది. అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కోపైలట్ వెళ్లిపోయారు.

ys jagan helicopter windshield damage incident inquiry pilot co-pilot attend before police

దీంతో జగన్ పర్యటన రోజు జరిగిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై వివరాలు రాబట్టేందుకు పైలట్, కోపైలట్ కు నోటీసులు జారీ చేసి ఇవాళ పిలిపించారు. విచారణలో పైలట్, కో పైలట్ చెప్పే వివరాల ఆధారంగా ఇందులో తప్పెవరిదో తేల్చబోతున్నారు. వైసీపీ ఇప్పటికే దీన్ని జగన్ భద్రతలో పోలీసుల లోపంగా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు పోలీసులు తమ విచారణలో ఏం తేల్చబోతున్నారనేది కీలకంగా మారింది.

వీఐపీ అయిన జగన్ హెలికాఫ్టర్ వరకూ జనం వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదన్న విషయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైలట్, కోపైలట్ తప్పిదం ఉంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా ఈ ఘటనతో వీఐపీల భద్రతపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+