వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాల్లో పర్యటించండి, సత్తా చూపించాలి: జగన్, పాదయాత్ర తర్వాత

తాము అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ చేస్తానని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాము అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ చేస్తానని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు.

జగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డిజగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డి

విజయవాడలోని వైసిపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు.

కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరుకర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు

జిల్లాల్లో పర్యటించండి

జిల్లాల్లో పర్యటించండి

పార్టీలోని బీసీ నాయకులు అన్ని జిల్లాలో పర్యటించాలని జగన్ సూచించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని మోసం చేశారన్నారు.

సత్తా చూపించాలన్న జగన్

సత్తా చూపించాలన్న జగన్

చంద్రబాబుకు బీసీల సత్తా చూపించాలని జగన్ అన్నారు. బీసీ నాయకులు అన్ని జిల్లాలో పర్యటించాలన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు మాట తప్పారు

చంద్రబాబు మాట తప్పారు

రూ.10వేల కోట్లతో బీసీ ప్లాన్ అని చెప్పి, చంద్రబాబు మాట తప్పారన్నారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ కూడా చేయలేదన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు.

పాదయాత్ర తర్వాత జనగర్జన

పాదయాత్ర తర్వాత జనగర్జన

పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిద్దామని చెప్పారు. ప్రతి కులానికి న్యాయం జరిగేలా బీసీ డిక్లరేషన్ ఉంటుందన్నారు. ప్రతి పేదవాడికి వైయస్సార్ పాలనను గుర్తు చేస్తామన్నారు. అన్న వస్తున్నాడు.. రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు చెప్పాలని జగన్ నేతలకు సూచించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy holds first YSRCP meet in Vijayawada office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X