అత్యాచార నిందితుల్లో ఏపీ మంత్రులు, బికినీ వేసి గంతులేస్తారా: గొంతు చించుకున్న జగన్

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఏపీకి చెందిన ఇద్దరు మంత్రుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, బికినీలు అంటూ గంతులు వేస్తారట అని బీచ్ లవ్ ఫెస్టివెల్ పైన ధ్వజమెత్తారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైసిపి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు గొంతు చించుకున్నారు. గొంతు బొంగురుపోయేలా మాట్లాడారు.

చంద్రబాబు కేబినెట్లో :

చంద్రబాబు హయాంలో పోలీస్ రాజ్యం నడుస్తోైందన్నారు. అత్యాచారా ప్రదేశ్‌గా మారిందన్నారు. మహిళల మీద అత్యాచార నిందితుల్లో దేశం మొత్తంలో నలుగురు మంత్రి పదవుల్లో ఉన్నారన్నారు.

YS Jagan hot comments on ministers and BLF 2017

అందులో ఇద్దరు మన ఏపీ నుంచే ఉన్నారని, ఇది మన కర్మ అన్నారు. మహిళలపై అత్యాచారం చేసిన మంత్రుల్లో ఇద్దరు ఏపీ నుంచి ఉన్నట్లు ఏబీఆర్ సంస్థ తెలిపిందన్నారు. వనజాక్షి పైన దాడి జరిగినా కేసు పెట్టరని, రిషికేశ్వరి చనిపోయినా కేసులు ఉండవన్నారు.

బికినీ పార్టీలు ఏమిటి

ఇంత జరుగుతుంటే చంద్రబాబు తన పాలనలో విశాఖలో బికినీ పార్టీలు ఏర్పాటు చేయడం విడ్డూరమన్నారు. బికినీలు వేస్తారట, గంతులు వేస్తారట, ఎక్కడి నుంచో జంటలను తీసుకు వస్తారట అని మండిపడ్డారు. చంద్రబాబు చేసే పనులకు జైల్లో పెట్టినా అభ్యంతరం లేదన్నారు.

నువ్వు కూడానా బాబూ

చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తూ జగన్ ఓ సంఘటనను కూడా చెప్పారు. రోమన్ రాజకీయవేత్త అయిన జూలియన్ సీజర్‌ను వెన్నుపోటు పొడిచిన ఆయన నమ్మిన బంటు బ్రూటస్ సంఘటనను ప్రస్తావించారు. ఈ సంఘటనను ఏపీ సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు పోల్చుతూ చెప్పారు.

'జూలియస్ సీజర్‌ను వెనుక నుంచి ఆయన నమ్మినబంటు బ్రూటస్ కత్తితో పొడిచాడు. ఆ సందర్భంలో సీజర్ బ్రూటస్.. యు టూ అన్నాడు. అంటే, బ్రూటస్ నువ్వు కూడా నమ్మక ద్రోహం చేస్తావా? అని అర్థం. ఈ రోజున అదే పరిస్థితి ఏపీలో జరుగుతోంది. ఎలా అంటే... ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న ప్రజలను చంద్రబాబు కూడా అదేమాదిరి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబూ, నువ్వు కూడా నమ్మకద్రోహం చేస్తావా? అంటూ ప్రజలు బాధపడుతున్నార'ని జగన్ ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ గతంలో విశాఖ కేంద్రంగానే చెప్పారని, హోదా అయిదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలని దానికి చంద్రబాబు కోరారని, వారు హామీలిచ్చి వెళ్లిన ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచే ప్రత్యేక హోదా కోసం జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని జగన్ ప్రకటించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దాన్ని సాధించుకున్న నగరం విశాఖ అని, అలాంటి నగరం నుంచే ఉద్యమం సాగుతోందని, ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం చేస్తామన్నారు. కాగా, జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభకు జనాలు భారీగా తరలివచ్చారు. జగన్‌ ఏకంగా ఒక గంటా పది నిమిషాలు ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+