రివర్స్: విశాఖలో టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ ఇదే!

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైసీపీ కూడ అవలంభించాలని చూస్తోంది. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Recommended Video

    Ys Jagan implementing tdp strategy

    విశాఖపట్టణం: తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైసీపీ కూడ అవలంభించాలని చూస్తోంది. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.కొత్తగా పార్టీలో చేరే నేతలకు తాము కోరుకొన్న చోట పోటీ చేసేందుకు ఆవకాశాలు కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం. విశాఖ జిల్లాలో అధికార పార్టీ వ్యూహలకు వైసీపీ ప్రతి వ్యూహలను రచిస్తోంది.

    ఏపీ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చీప్ వైఎస్ జగన్ ఇప్పటి నుండి వ్యూహ రచన చేస్తున్నారు. అయితే అధికార పార్టీ లోకి వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు వలసలు సాగుతున్నాయి.

    ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీలోని అసంతృప్త నేతలతో పాటు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈప్లాన్ ప్రకారంగా టిడిపిలో చేరిన నేతల కారణంగా పార్టీలో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవాలని వైసీపీ చీఫ్ భావిస్తున్నారు.

     పాడేరు ఎంపీ స్థానం నుండి గిడ్డి ఈశ్వరీని బరిలోకి దింపే యోచన

    పాడేరు ఎంపీ స్థానం నుండి గిడ్డి ఈశ్వరీని బరిలోకి దింపే యోచన

    విశాఖ జిల్లాలో టిడిపి వ్యూహలకు వైసీపీ ప్రతి వ్యూహన్ని రచిస్తోంది. అయితే ఇతర పార్టీల నుండి చేరుతున్న నేతలకు వైసీపీ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి టిక్కెట్లను కేటాయించనున్నట్టు హమీలు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలో ఓ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతల్లో ప్రచారంలో ఉంది.అయితే ఈ కారణంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఎమ్మెల్యే స్థానంలో కాకుండా పాడేరు ఎంపీ స్థానం నుండి బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాడేరు ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు గిడ్డి ఈశ్వరీ సానుకూలంగా లేరనే ప్రచారం కూడ ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఆ సమయంలో చోటు చేసుకొనే రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదంటున్నారు నేతలు.

     కిడారి సర్వేశ్వరరావు టిడిపిలో చేరికతో ఇలా..

    కిడారి సర్వేశ్వరరావు టిడిపిలో చేరికతో ఇలా..

    వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు రెండేళ్ల క్రితం టీడీపీలో చేరడంతో శెట్టి అప్పాలు, జర్సింగి సూర్యనారాయణ,రాజారావు లను అధిష్టానం సమన్వయకర్తలుగా నియమించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఇటీవలే ఓ ఉద్యోగిని పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్టు వస్తోందని భావించారు. కానీ, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీలో చేరితే ఉద్యోగికి కూడ టిక్కెట్టు దక్కుతోందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

     మాజీ ఎమ్మెల్యే రవిబాబు వైసీపీలో చేరికకు రంగం సిద్దం

    మాజీ ఎమ్మెల్యే రవిబాబు వైసీపీలో చేరికకు రంగం సిద్దం

    మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వైసీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే రవిబాబు పార్టీలో చేరడానికి వైసీపీ చీఫ్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్టు దక్కనుందోననే చర్చ సాగుతోంది. అయితే ఎవరికి జగన్ టిక్కెట్టు ఇవ్వనున్నారనే ఉత్కంఠ ఇప్పటినుండే సాగుతోంది.

     టిడిపికి చెక్ పెట్టేలా వైసీపీ ప్లాన్

    టిడిపికి చెక్ పెట్టేలా వైసీపీ ప్లాన్

    టిడిపి తరహలోనే వైసీపీ కూడ వలసలను ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీల్లో బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. అంతేకాదు అధికార పార్టీలోని అసంతృప్తులను కూడ తమ వైపుకు లాక్కొనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ తరహ వ్యూహలు కొంత ఫలిస్తున్నాయనే వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+