జగన్‌కేం తెలుసు: పరిటాల సునీత, వెళ్లొద్దన్నందుకే: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: నిత్యం ఏసీ గదుల్లో ఉండే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి నీటి కష్టాలు ఏం తెలుసునని మంత్రి పరిటాల సునీత సోమవారం మండిపడ్డారు. జగన్‌కు సభా సంప్రదాయాలు తెలియవన్నారు. రాయలసీమకు నీరివ్వడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు.
పట్టిసీమ పూర్తయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని జగన్ భయపడుతున్నారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తామన్నారు. పట్టిసీమను అడ్డుకుంటే సీమద్రోహులుగా మిగులిపోతారని హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని మంత్రి పీతల సుజాత జగన్‌ను కోరారు.

బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘం నేత, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వేరుగా అన్నారు. బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.
బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు రూ.రెండువేలకు పెంచాలన్నారు. అసెంబ్లీ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా... సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు తనను అసెంబ్లీకి వెళ్లవద్దన్నారని, అందుకే వెళ్లడం లేదన్నారు.












Click it and Unblock the Notifications