వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ జాతీయపార్టీకి జగన్ ఝలక్ ఇవ్వటం పక్కా... చెప్పకనే చెప్పిన ఏపీసీఎం వైఎస్ జగన్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఏపీ సీఎం వైయస్ జగన్ ఝలక్ ఇస్తారా? బీజేపీ వ్యతిరేక పోరాటంలో భాగంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న కెసిఆర్ కు ఏపీలోని అధికార వైసిపి షాక్ ఇచ్చే అవకాశం ఉందా? రాష్ట్రపతి ఎన్నికలలో భేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ తీరు భవిష్యత్తులో కేసీఆర్ జాతీయ పార్టీ పై ఎఫెక్ట్ చూపనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

బీజేపీపై పోరాటం చేస్తున్న కేసీఆర్ కు వైసీపీ సహకరించే అవకాశం లేదు

బీజేపీపై పోరాటం చేస్తున్న కేసీఆర్ కు వైసీపీ సహకరించే అవకాశం లేదు


తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీ పెడతానని, బీజేపీ వ్యతిరేక పోరాటంలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అయితే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానని చెబుతున్న జాతీయ పార్టీకి పక్క తెలుగు రాష్ట్రమైన ఏపీ నుండి సహకారం అందదు అన్న సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక కూటమికి ఓటు వేయాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే, ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం బేషరతుగా బీజేపీకి తమ మద్దతును ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీ లోని వైసీపీ సర్కార్, కేంద్రంలోని బిజెపి బాటలోనే నడుస్తుందని ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీంతో బీజేపీ పై పోరాటం చేస్తున్న కెసిఆర్ కు ఏపీ ప్రభుత్వం సహకరించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీకి కేంద్రం అన్యాయం చేసినా .. కేంద్రానికి సహకరిస్తున్న అధికార వైసీపీ

ఏపీకి కేంద్రం అన్యాయం చేసినా .. కేంద్రానికి సహకరిస్తున్న అధికార వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతుందని, ప్రత్యేక హోదా హామీని గాలికి వదిలేసిందని కేంద్రం తీరుపై ప్రజలలో, పలు రాజకీయ పార్టీల నాయకులలో అసహనం వ్యక్తం అవుతుంది. అయితే ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుండి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందించాలని, కేంద్రానికి విజ్ఞప్తి చేయడం మినహాయించి, కేంద్రంపై పెద్దఎత్తున పోరాటం చేసిన దాఖలాలు లేవు. కేంద్రంలోని బిజెపి సర్కార్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసలే లేవు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై ఆసక్తికర చర్చ

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై ఆసక్తికర చర్చ

జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న సి.బి.ఐ, ఈడీ కేసుల నేపథ్యంలోనే కేంద్రానికి సరెండర్ అయ్యారు అన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుండి వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి బలపరిచిన అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు తమ బేషరతు మద్దతు ప్రకటించింది వైసిపి. దీంతో వైసిపి కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉందని చర్చ జరుగుతుంది.

 కెసిఆర్ జాతీయ పార్టీని ఏపీలో ఆహ్వానించే అవకాశం లేదు

కెసిఆర్ జాతీయ పార్టీని ఏపీలో ఆహ్వానించే అవకాశం లేదు

ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బిజెపి సర్కారును గద్దె దించడం కోసం జాతీయ పార్టీ పెడతానని ప్రకటన చేసిన క్రమంలో, ఆ జాతీయ పార్టీ కోసం పని చేసే జాబితాలో వైసీపీ ఉండబోదని చర్చ జరుగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి వైసిపి ఏ విధంగాను సహకరించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్, ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం వ్యూహాలు రచిస్తున్న వేళ ఏపీ పైన కూడా ఆయన ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ కెసిఆర్ జాతీయ పార్టీని ఏపీలో ఆహ్వానించే అవకాశం లేదు.

 రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి వైసీపీ మద్దతు ఇవ్వడం కేసీఆర్ కు పెద్ద షాక్

రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి వైసీపీ మద్దతు ఇవ్వడం కేసీఆర్ కు పెద్ద షాక్

ఇక తాజాగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో, వైసిపి ఆలోచన, వైసిపి వ్యూహం సుస్పష్టంగా కనిపిస్తుంది. బిజెపిని వ్యతిరేకించే వర్గాలను కలుపుకుపోతామని చెబుతున్న కెసిఆర్ కు రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి వైసీపీ మద్దతు ఇవ్వడం పెద్ద షాక్ అనే చెప్పాలి. పక్క తెలుగు రాష్ట్రంలోని అధికార పార్టీతోనే మద్దతు కూడగట్టలేని కేసీఆర్, జాతీయంగా వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా మద్ధతును కూడగడతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇచ్చిన అవకాశంతో ఇవాళ సీఎం కేసీఆర్ కు జాతీయ పార్టీ విషయంలో తమ నిర్ణయాన్ని వైసిపి చెప్పకనే చెప్పిందని చర్చ జరుగుతుంది.

English summary
AP CM Jagan mark shock to CM KCR,With the unconditional support to the BJP in the presidential election, there is an interesting debate going on in Telugu states that Jagan ready to give a big shock to KCR National Party in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X